తూప్రాన్ మున్సీపాలీటిలో మన్నె శ్రీనివాస్, సతీష్ చారి బిఆర్ఎస్ పార్టీ 15 వార్డు అధ్యక్షులు భాయికాడి ఆంజనేయులు , బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి

వెంకట్ రామ్ రెడ్డి మద్దతుగా జోరుగా ఇంటింటి ప్రచారం.

మెదక్ ఎంపీ సీటు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది –
బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం,

తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ ఎంపీ సీటు మళ్లీ బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే శ్రీనివాస్ ,తూప్రాన్ మున్సిపాలిటీ
బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సతీష్ చారి , తూప్రాన్ మున్సిపాలిటీ 15 వార్డు అధ్యక్షులు బాయి కాడి ఆంజనేయులు , చిన్నిలింగ్ మల్లికార్జున్ గౌడ్ ,మహేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ బిజెపి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని గ్రామాలను అభివృద్ధి చేసిన కేసీఆర్
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థివెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు సూచించారు. సోమవారం తూప్రాన్ మున్సిపాలిటీలోని
పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పార్టీ కరపత్రాలను పంచుతూ కారు గుర్తుకు ఓటు ఓటు వేయాలని అభ్యర్థించారు. మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులు బిఆర్ఎస్ పార్టీ కేసు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి సాధ్యమయ్యాయని ఓట్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో మొహమ్మద్ హుస్సేన్ ,బండ నాగరాజు , జక్కాపురం శ్రీకాంత్ ,కటికే నాగరాజు, పార్టీ నాయకులు ,బి ఆర్ ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking