రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర

 

దానితోపాటే రిజర్వేషన్లు,ఎన్నికలు కూడా

డీసీసీ ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్

పట్టణంలో పలు వార్డుల్లో ప్రచారం

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 05 : మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగంతో పాటు ఎన్నికలు, రిజర్వేషన్లు కూడా రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నందున ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో అయన స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వల పుణ్యమా అని రాష్ట్రంలో దేశంలో విద్య,ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.నిరుద్యోగం, ఆకలి సూచిల్లో భారత్ మరింత దిగజారిందన్నారు. వివిధ వర్గాల మధ్య ఘర్షణలు లేపి లబ్ది పొందాలనే బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు.దేశం అభివృద్ధి చెందాలన్న,ప్రజల హక్కులు, సమానత్వం రావాలన్న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. అందుకే కాంగ్రెసు అభ్యర్థి గడ్డం వంశికృష్ణకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలని కోరారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్,పట్టణ అధ్యక్షుడు ఎండి అరిఫ్,గుత్తికొండ శ్రీధర్,అమీర్, ఉత్తురి రవీందర్,కొత్త వెంకటేశ్వర్లు,హజీ,చిన్న రమేష్,నవాబ్,చంద్రమౌళి, వెంకటస్వామి గౌడ్,బొప్పూ సతీష్,మూల కిషన్,బాణాల రమేష్,మాడిశెట్టి శ్రీకర్,హఫీజ్, కత్తెరపాక రాకేష్,మినుముల శాంతికుమార్,మేడి లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking