ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 17 : జల్ జంగల్ జమీన్ అంటూ నినదించి రజాకార్ల చేతిలో హతమైన గోండు బెబ్బులి కొమురం భీమ్ జోడేఘాట్ కు తలమల గ్రామస్తులు మండల ఆదివాసీ నాయకులు గురువారం తరలి వెళ్లారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆదివాసీ హక్కుల కోసం కొమ్రాం భీమ్ చేసిన పోరాటం అద్భుతమని, ఆయన త్యాగాలు ఆదివాసీ సమాజానికి చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన గిరిజన పోరాటం నిజాం సర్కార్‌ను ఎదుర్కొనడంలో కీలకమని,ఇలాంటి నాయకుడి వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వ్యాఖ్యానించారు. అయన స్ఫూర్తి తో ప్రస్తుత ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక నిర్ణయాలను అర్థం చేసుకొని ఐక్య పోరాటాలు చెయ్యాలని,తెగల మధ్యలో చిచ్చులు పెట్టె వారి పట్ల జాగ్రత్త పడుతూ ఐక్యతను కాపాడు కుంటూ ముందుకు వెళ్ళాలని కోరారు.కొమ్రాం భీమ్ తన జీవితాన్ని ఆదివాసీ హక్కుల కోసం అంకితం చేసి, సాయుధ పోరాటం ద్వారా నిజాం సర్కార్ ను ఎలా ఎదుర్కొన్నారో వివరించారు.ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు గెడం బొజ్జీరావు.మండల నాయకులు మెస్రం చిత్రు,కుర్సెంగ కిష్టు, కోవబాదు,పూసం లింబరావు,పుసం చిత్రు,మహిళలు పాల్గొన్నారు.