వయోజన విద్య కేంద్రాలు ప్రారంభం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 06 : స్వచ్ఛ సేవ వికాస్ సంస్థ ద్వారా బత్తుల శ్యామ్ రీజయిస్ పాస్టర్ చిలక సతీష్ డానియల్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలో ఐదు వయోజన విద్యా కేంద్రములను ప్రారంభించడం జరిగింది. శుక్రవారం స్థానిక వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ లో వయోజనులందరూ చదువుకోవాలని మాట్లాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ రాజేశ్వరి మాట్లాడుతూ…వయోజనలు చదువుకోవాలని ఆలోచన చాలా అద్భుతమైన దన్నారు.ఈ సంస్థ గతంలో చేసిన సమాజసేవను గుర్తిస్తూ అభినందించారు.‌ అనంతరం ఎంపీటీసీ బత్తుల సత్తన్న మాట్లాడుతూ… వయోజనులు చదువుకోవడంతో సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారని అన్నారు.అనంతరం పాస్టర్ శామ్ డానియల్ మాట్లాడుతూ… వయోజనులు చదువుకోకపోతే మోసపూరిత ప్రమాదాలు జరుగుతాయని వివరించడం జరిగింది.కనుక వయోజనులు కనీసం సమాజ అవగాహన కోసం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking