మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 6 (ప్రజాబలం) ఖమ్మం నగరం 41వ డివిజన్ మున్నూరు కాపుల అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర పాల్గొని మాట్లాడారు ఖమ్మంలో లో జరిగిన అభివృద్ది ఎవ్వరు కాదనలేరు ప్రతిపక్షాలకు కూడా ఆ విషయం తెలుసు మీ అభివృద్ది కోసమే అహర్నిశలు పని చేశా ఇక ముందు కూడా చేస్తా ప్రజల కోరిక మేరకు ప్రతి గల్లీలో రోడ్లు వెతికి వెతికి వేసినం ఇప్పటి వరకు గడచిన 65 ఏళ్లలో కనీసం రూ.100 కోట్లు ఒకేసారి ఎవరైనా తెచ్చారా.. ఖమ్మం నగరంలో కనీస సదుపాయాలు ఎందుకు కల్పించ లేకపోయారు ఇక్కడ జరిగిన అభివృద్ది చుసి ఓటు వేయండి బిఆర్ఎస్ ప్రభుత్వం ను మళ్ళీ గెలిపించాలని. మీ కోరిక మేరకు మరింత అభివృధ్ది చేసి మీకు అందిస్తా ఈ సందర్భంగా పారా నాగేశ్వర రావు పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన కేక్ ను కుట్ చేశారు. వారికి మంత్రి పువ్వాడ, వద్దిరాజు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పారా నాగేశ్వర రావు అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, పారా శ్రీనివాస్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, వర్తక సంఘం చైర్మన్ కొప్పు నరేష్ కుమార్, జాబిశెట్టి శ్రీనివాస రావు, పొన్నం వెంకటేశ్వర్లు, కొప్పు నరేష్ కుమార్, రామిశెట్టి రమేష్ ఆర్విఎస్ సాగర్, గౌతమ్ బాబా తదితరులు ఉన్నారు.