ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి
సోన్ మండలం లొని మండల ప్రాథమిక పాఠశాల లో శుక్రవారం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి ప్రారంభించారు.
చిన్నారులకు అందించే అల్పహారాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం పిల్లలకు స్వయంగా బ్రేక్ ఫాస్ట్ వడ్డించి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి. చిన్నారులతో కలిసి అల్పాహారం తిన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, అందులో భాగం గానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అల్పాహార సమయం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. రాష్ట్రం లోని ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే సన్న బియ్యం తో, వివిధ రకాల కాయగూరల తో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్నామన్నారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో 1 నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులని, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తరగతి గది లో ఆకలిని నివారించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, విద్యార్థుల ఆరోగ్యం పెరుగుదలను మెరుగు పరచడం, విద్యార్థులు ప్రతీ రోజు పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించడం, నమోదు ను పెంచి డ్రాప్ ఔట్ ను తగ్గించడం కోసమని పేర్కొన్నారు. ఈ పథకం అమలు ద్వారా 20 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని అన్నారు.
ఆనంతరం విద్యార్ధులతో కలిసి బ్రే్క్ ఫాస్ట్ చేశారు.
ఈ కార్యక్రమంలో. డి ఈ ఓ రవీందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.