ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..జీవో నెంబర్ 58 ప్రకారం ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన నిర్మల్ జిల్లా బీఆర్ స్ అధ్యక్షులు ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి
కళ్యాణ లక్ష్మి పథకం కింద 108 మంది లబ్ధిదారులకు ఒక కోటి 8 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.
జీవో నెంబర్ 58 కింద సుమారు 24 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందించడం జరిగింది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి మళ్లీ అధికారంలోకి వస్తారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు,రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్లు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది అన్నారు.