విద్యార్థులకు ఓటు అవగాహన సదస్సు

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్:-

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల తూప్రాన్ మెదక్ జిల్లా ఎలక్ట్రో రోల్ లిటరీస్ క్లబ్ మానిటరింగ్ సభ్యులు సందర్శించినట్లు గురువారం
ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు కళాశాలలో జరుగుతున్న ఈవీఎం మాక్ పోలింగ్ మరియు ఓటు హక్కు అవగాహన సదస్సు కార్యక్రమాలకు సంబంధించి పర్యవేక్షణ చేశారు. విద్యార్థి విద్యార్థులను ఉద్దేశించి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి విద్యార్థి ఓటు హక్కు నమోదు చేసుకుని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శశిధర్ , నరేందర్, కళాశాల నోడల్ ఇంచార్జ్ శ్రీమతి రజిని కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ గోపీచంద్ అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking