తెలంగాణ ఆర్ట్‌ ఫెస్టివల్‌

కళలను, కళాకారుల ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణలో తొలిసారిగా తెలంగాణ ఆర్ట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్‌లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మూడ్రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిత్రాకారులు తమ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. 50 మంది చిత్రాకారుల కలం నుంచి జాలు 600లకు పైగా చిత్రాలు ఇందులో కొలువుదీరాయి. పింగాణీ పాత్రలపై సినీ నటులు, దేవతమూర్తుల, ప్రకృతి అందాల ఇలా పలు చిత్రాలు ప్రత్యేకార్షణగా ఉన్నాయి. వీటితో పాటు విభిన్న రకాలైన వర్ణచిత్రాలు సందర్శకుల మదినిదోస్తున్నాయి.చిత్రాకారులను ప్రోత్సహించి, వారి చిత్రాలకు సరైన మార్కెట్‌ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వహకురాలు స్పందన వాసిరెడ్డి తెలిపారు.ఎంతో మంది అద్భుతమైన చిత్రాకారుల చిత్రాలను నగరవాసులకు పరిచయం చేయనున్నట్లు ఆమె చెప్పారు. గిగిల్ మగ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆర్ట్‌ను ఒకవైపు పరిచయం చేస్తూ….మరోవైపు వచ్చే సందర్శకులకు వినోదం అందించేందుకు సంగీత విభావరి, నృత్యాలు, మంచి రుచికరమైన ఆహారపు రుచులను అందిస్తున్నట్లు స్పందన వివరించారు. కళాకారులు, కళాభిమానులు, కళాప్రియులందరూ ఒక్కసారి ఈ ప్రదర్శన సందర్శించి వారిని ప్రోత్సహించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking