మిషన్ భగీరథతో ఇంటింటికి నిలందించి మహిళల కన్నీటి కష్టాలు తీర్చినం
సంక్షేమం అభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్
261 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ కు భూమిపూజ
తాండూర్ లో రూ. 221 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన: మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి
తాండూర్, అక్టోబర్ 6:
పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్యం, సంక్షేమ రంగాలతో పాటు అభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని 3 లక్షల 42 రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించి
నున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం తాండూరు మున్సిపల్ కేంద్రంలో తాండూర్ శాసన సభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి తో కలిసి మంత్రి 221 కోట్లతో విలువతో కూడిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గావించారు.
261 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ కు భూమిపూజ చేసిన
మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎంఎల్ఏ రోహిత్ రెడ్డితో కలిసి
రూ. 2 కోట్లతో బిసి భవన్, రూ.2 కోట్లతో హిందూ, ముస్లీం స్మశాన వాటికలకు, రూ .16 కోట్లతో వరద నీరు పోయేందుకు కాలువ పనులకు, రూ.12.26 కోట్లతో టిఎస్ఐఐసీ ఆటోనగర్, 2 కోట్ల రూపాయలతో నిర్మించే బంజారా భవన్, 50 లక్షలతో క్రిస్టియన్ భవన్ , కోటి రూపాయలతో మైనార్టీ భవన్ లకు మంత్రి శంకుస్థాపన గావించారు. జినుగుర్తి లో గిరిజన సంక్షేమ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ కొరకు రూ .5 కోట్లతో చేపట్టే పనులకు అదేవిధంగా రూ.21.30 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన మంత్రి శంకుస్థాపన చేశారు . అదేవిధంగా బెల్కటూర్ బ్రిడ్జి కు రూ 3.70 కోట్లతో చేపట్టే పనులకు, పాత తాండూరులో రూ.74 కోట్లతో చేపట్టే రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేపట్టారు.
18 కోట్లతో జినుగుర్తిలో నిర్మించిన మైనార్టీ సంక్షేమ పాఠశాలలో మంత్రి ప్రారంభించారు. రూ. 30.23 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు సరఫరా కు ప్రారంభోత్సవం
అనంతరం
ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ… పాలమూరు – రంగారెడ్డి పథకంతో కొడంగల్, పరిగి, తాండూర్, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాలు పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం అవుతాయని మంత్రి చెప్పారు.
దేశంలో ఎక్కడలేని విధంగా పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యాసంస్థలకు, పరిశ్రమలకు హబ్ గా
మారిందని వివరించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో బిజెపి పాలిట రాష్ట్రాలలో తెలంగాణ లాంటి పథకాలు లేవని, వారి చేత కాదని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక లేక పోతున్నారని మంత్రి మహేందర్ రెడ్డి విమర్శించారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో 50 ఏళ్లలో లేని అభివృద్ధికి సంబంధించిన నిధులను తెచ్చి అభివృద్ధి పరిచారని పేర్కొన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి అభివృద్ధితో తాండూరులో ఇంకను వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని అన్నారు.
