ఖమ్మం ప్రతినిధి నవంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం అసెంబ్లీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ శనివారం తనిఖీ చేసి, అధికారులకు సూచనలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో ఇవిఎం భద్రపరిచే ర్యాక్‌లు పరిశీలించారు. కిటికీలు, భద్రతను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి టేబుల్, పోస్టల్ బ్యాలెట్ టేబుల్, ఏజంట్ల టేబుళ్ల ఏర్పాటు పై సూచనలు ఇచ్చారు. లెక్కింపు కొరకు ఏర్పాటుచేసిన 14 టేబుళ్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు చూడడానికి వీలుగా ఏర్పాటుచేసిన బ్యారికేట్ పరిశీలించారు. ఎన్నికల పరిశీలకుల సీటింగ్ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ కేంద్రానికి ఇవిఎంల రవాణా, రిటర్నింగ్ అధికారి, ఇతర అధికారుల ప్రవేశం, అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్ల ప్రవేశాలను, పరిశీలించారు. టేబుళ్ల ఏర్పాటు, భద్రత, ఇవిఎంల కదలికలు, సిబ్బంది, అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్ల కదలికలపై చేపట్టాల్సిన చర్యల గురించి సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అదనపు డిసిపి ప్రసాద్ రావు, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, రూరల్ ఏసీపీ బస్వారెడ్డి ఆర్ అండ్ బి ఎస్‌ఇ శ్యామ్ ప్రసాద్, ఏఇఇ విశ్వనాథ్, అధికారులు తదితరులు ఉన్నారు.
.