దూదేకుల కులస్తులకు బీసీ-ఈ రిజర్వేషన్ సాదించే వరకు మా పోరాటం ఆగదు

రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మందూదేకుల కులస్తులకు బీసీ-ఈ రిజర్వేషన్ సాదించే వరకు మా పోరాటం చేస్తామని దూదేకుల/ నూర్ బాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా అన్నారు.నిన్న ఖమ్మం నగరం పెన్షనర్స్ భవనం నందు జరిగిన దూదేకుల/ నూరేబాషా ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా ఖమ్మం నగర కమిటీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం కు రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో అన్ని రకాల రాజకీయ పార్టీలు దూదేకుల కులస్తులను ఎన్నికల సమయంలో వాడుకొని ఆ తర్వాత పక్కన పెడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో దూదేకుల కులస్తులు దాదాపు 20 లక్షలు పైగా ఉన్నప్పుటికి జనాబా ధామాషా ప్రకారం మాకు రావల్సిన పధవులతో తీవ్ర అన్యాయం జరుగుతుం దన్నారు.దూదేకుల కులస్తుల రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తామని అంత వరకు ఉధ్యమం ఆపే ప్రస్తక్తి లేదని అన్నారు.దూదేకుల కులస్తులకు నామినేటడ్ పదవులలో కో-ఆప్షన్ ఉర్దూ అకడమి పధవులలో అవకాశంకల్పించాలన్నారు ఈ కారక్రమంలో రాష్ట్ర ప్రధాన కాధర్శిగా షేక్ రహీం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరిగా షేక్ లాల్ సాహెబ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా షేక్ రహీం పాషా జిల్లా ప్రధాన కార్యవర్తిగా షేక్ సిద్దా సాహెబ్ నగర ప్రెసిడెంట్ గా సైధా హుస్సేన్ అధికార ప్రతినిధిగా నాగుల్ మీరా ని ఏన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ లాల్ జాన్ బాషా జాయింట్ సెక్రటరీ సోందు మీయా మహిళాధ్యక్షురాలు జానీమీయా తదితురులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking