ఈనెల 22న ఖమ్మం లో జరిగే ఖమ్మం నియోజకవర్గం స్థాయి యాదవ కురుమల ఆత్మీయ సమ్మేళనం ను జయప్రదం చేయండి

 

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి మచ్చ శ్రీనివాసరావు

టిపిసిసి మెంబర్ పుచ్చకాయల వీరభద్రం

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం యాదవ కురుమలను మాయ మాటలతో నమ్మకద్రోహంతో మోసం చేసిన కెసిఆర్ ను గద్యదించాలని సంకల్ప దీక్షతో ఈనెల 22న పొంగులేటి క్యాంప్ ఆఫీస్ పక్కన ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఖమ్మం నియోజకవర్గం యాదవ కురుమల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ఈ కార్యక్రమంలో యాదవులు కురుమలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ రాష్ట్ర కార్యదర్శి మచ్ఛా శ్రీనివాసరావు యాదవ్ టిపిసిసి మెంబర్ పుచ్చకాయల వీరభద్రంకార్పొరేటర్ పల్లెబోయిన భారతి చంద్రం పిలుపునిచ్చారు ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీసులో ఈనెల 22న జరిగే యాదవ కురుమల ఆత్మీయ సమ్మేళనం కరపత్రంనుఆవిష్కరించడం జరిగింది తదనంతరం జరిగిన సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గొర్రెల సంఘాలు మరియు ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, గొర్రెలకు ఇన్సూరెన్స్, ఎన్సీడీసీ, బ్రీడింగ్ ర్యామ్ ర్యామ్ లామ్స్ లాంటి స్కీములు ద్వారా గొర్రెల మంజూరు చేయడం జరిగిందని, ఈనాడు గొర్రెలు ఇస్తానని డీడీలు కట్టించుకుని మోసం చేసిన కేసీఆర్, కార్పొరేషన్ పరిధిలో గొర్రెలకు బదులు పాడి గేదెలు ఇస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ నమ్మకద్రోహం చేశారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఇచ్చిన స్ఫూర్తితో మలిదశ తెలంగాణ పోరాటంలో అగ్ర భాగాన నిలిచిన యాదవ కురుమలను తెలంగాణ వచ్చాక నమ్మకద్రోహం చేసి, గొర్రెల పంపిణీ పథకం అడ్డుపెట్టుకొని వందల కోట్ల రూపాయలు దోచుకున్నాడని, ఇలాంటి నిరంకుశత్వ కెసిఆర్ ని ఓడించడమే లక్ష్యంగా యాదవ కురుమలంతా ఏకతాటిపైకి రావాలని వక్తలుపిలుపునిచ్చారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మలీదు జగన్, మలీదు వెంకటేశ్వర్లు,చేతుల నాగేశ్వరరావు పెద్ద పాపారావు,బమ్మిడి శ్రీనివాస్, మారుతి బీరేష్ చింతల ఉపేందర్, పల్లెబోయిన రవి దొంగల సీతారాములు అంగడాల నరసింహారావు, దాసరి శివ జోన బోయిన పాపయ్య దొంతబోయిన నరసింహారావు, పొదిలి ఆదినారాయణ గుంటి వెంకన్న, బొలిగొర్ల తిరుమలరావు, కాల్వ నరసింహారావు పొదిలి భూపతి పొదిలి ఉపేందర్, పల్లె బోయిన శ్రీనివాసరావు, బట్ట కోటయ్య, బాతుల సుధాకర్, ఏరే మల్లేశం, దొంతబోయిన ఉపేందర్, రఘురాం తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking