హస్తం గుర్తుకు ఓటు వేసి తుంకుంట నర్సారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి.
తూప్రాన్ నవంబర్ 18
(ప్రాజబలం న్యూస్)
ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తుంకుంట నర్సారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, తూప్రాన్ పట్టణంలోని వీధిలో జోరుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు,ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పల్లెర్ల రవీందర్ గుప్తా, నాగరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, అమిద్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సునామీ కొనసాగుతుందని,పట్టణంలోని వాడ వాడల్లో కాంగ్రెస్ అభ్యర్థికి జనం నీరాజనం పడుతున్నారని, నర్సారెడ్డి గెలుపుతో గజ్వేల్ నియోజకవర్గం ముఖ చిత్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు తుంకుంట నర్సారెడ్డిని ,అత్యదిక మెజారిటీతో గెలిపించాలని,కోరారు,
ఈ కార్యక్రమంలో కోక్కొండ నరసింహారెడ్డి, నాగరాజ్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి, శశి భూషణ్ రెడ్డి , మాజీ ఎంపిటిసి అమిద్, బొల్లు నరేందర్, అజయ్ ముదిరాజ్, బాబు గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
