కాంగ్రెస్ వస్తే 24 గంటల కరెంటు 2 లక్షల రుణమాఫీ

నర్సాపూర్ నవంబర్ 18 ప్రాజబలం న్యూస్ :-

బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే పేద ప్రజల భూములను కబ్జా చేస్తూ, భూములను గుంజుకోవడం ఖాయమని, నర్సాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి సతీమణి శైలజారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుహాసిని రెడ్డి, చింతల కర్ణాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, నాయకులు పులిమామిడి నవీన్ గుప్తాలు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని దంతాన్ పల్లి, పాంబండ, రత్నాపూర్, గుండ్లపల్లి, మల్లుపల్లి తండా పలు గిరిజన తండాలలో ఆవుల రాజిరెడ్డి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో వారు మాట్లాడుతూ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజీ రెడ్డి హస్తం గుర్తు పై ఓట్లు వేసి గెలిపించవలసిందిగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సుహాసిని రెడ్డి, చింతల కర్ణాకర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, పులిమామిడి నవీన్ గుప్తాలు మాట్లాడుతూ 2018 ఎన్నికల బహిరంగ సభలో నర్సాపూర్ చౌరస్తాల కుర్చీ వేసుకొని లక్ష ఎకరాలు పారిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష ఎకరాలు ఎక్కడ పారిందో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నక్కజిత్తుల వేషాలకు, కల్లిబోల్లి మాటలకు ప్రజలు మోసపోవద్దని వారు పిలుపునిచ్చారు. లక్షన్నర కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం కూలిపోయిందని అన్నారం పగిలిపోయిందని వారు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ప్రజలకు తెలియజేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆవుల శైలజా రెడ్డి, చిలుముల సుహాసినిరెడ్డి, కరుణాకర్ రెడ్డి పులిమామిడి నవీన్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, మాజీ జడ్పిటిసిలు ఉమాలక్ష్మీ కాంతారావు, కమల పూల్ సింగ్, నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు వారాల గణేష్, కాంలేగారి సత్యనారాయణ, మంతూరి రమేష్, కొడకంచి రవీందర్ గౌడ్, కొడకంచి గణేష్ గౌడ్, వజ నగేష్, వజ శ్రీనివాస్, ఇసుగారి శ్రీనివాస్, అరుణ్, ఈసారపు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking