కార్పొరేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 6 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం నగర పాలక సంస్థ అభివృద్ధిపథంలో పయనిస్తూ, రాష్ట్రంలో ఆదర్శ నగర పాలక సంస్థగా రూపుదిద్దుకుందని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు.  బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నగర మేయర్ నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో ప్రవేశపెట్టిన 22 అంశాలతో కూడిన ఎజెండాను సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషితో ఖమ్మం నగర అభివృద్ధిలో భాగంగా, ఇంజనీరింగ్, పరిపాలన, నగర ప్రణాళిక, పారిశుద్ధ్యం, ఆరోగ్య వంటి విభాగాలకు సంబంధించి ఆమోద ప్రతిపాదనలు, అదే విధంగా కార్పొరేషన్ లోని 60 డివిజన్ల పరిధిలో ఆయా డివిజన్ల వారీగా చేపట్టిన అభివృద్ది పనులు, చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు నిధులు, కావాల్సిన మౌళిక సదుపాయాలు, డివిజన్ లలో నెలకొన్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికి కృషి వంటి పలు కీలక ప్రధాన అంశాలపై ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలతో చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార ముక్తార్, ఫ్లోర్ లీడర్ కర్నాటి క్రిష్ణ, కార్పొరేటర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణాలాల్, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, మేనేజర్. విజయానంద్,  కార్పొరేటర్లు, ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ, మలేరియా తదితర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking