– నిస్వార్థ ప్రజా నాయకుడు..
– అవినీతి మరక లేని మంత్రి.. కల్మషం ఎరుగని నేత
– ఎందరికో రాజకీయ ఓనమాలు నేర్పిన మంచి మనిషి
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 14 (ప్రజాబలం) ఖమ్మం సాదాసీదా వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి రాజకీయాల వైపు అడుగులు వేసి,
స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానంతో తెలుగుదేశం లో చేరి స్వల్ప ఓట్లతో ఓటమి చెందినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుని వలె తిరిగి ఎలక్షన్లో గెలుపొంది నాటి నుండి నేటి వరకు అందరి మన్నలను అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు అందరికీ సుపరిచితమే. ఆంధ్ర, తెలంగాణలో తన పేరుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో శిలాఫలకాలు మారుమూల పల్లెలకు కొండరెడ్ల ప్రాంతాలకు సైతం అభివృద్ధి చేసి తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్న మహా నేత అతను. కష్టాలను ఇష్టాలుగా మలుచుకుని.. అనేక కష్టాలను ఒడిదుడుకులు ఎదుర్కొని రాజకీయాలలో తనదైన ముద్రను వేసుకున్నారు. ప్రత్యర్థి కుటుంబాలపై సైతం పొగ పంతంలేని నేత మహా నేత . కుటుంబ నేపథ్యం వ్యవసాయమైనప్పటికీ, వీరు సైతం వ్యవసాయమే ఇష్టపడతారు. మచ్చలేని మహానేత. నిస్వార్ధమే.. లక్ష్యంగా పనిచేసిన ఆశయాల అభివృద్ధి సాధకుడు. ఎన్నో గెలుపు ఓటమిలను చూసిన… అలుపెరుగని బాటసారి . గెలిచిన అనేక సందర్భంలోనూ వివిధ మంత్రుత్వ శాఖలను తనదైన మార్పులతో అభివృద్ధిని పరిగెత్తించారు. చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేశారు. వీరేనండి మన అందరి సుపరిచితులు అనేక సందర్భాలలో అనేక మంత్రిత్వ శాఖలను చేసిన రథసారథులు నేటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు. వీరిపై ప్రత్యేక కథనం. మెట్రో మీకోసం మీ అందరి కోసం. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి మంత్రిగా పనిచేస్తున్నారు. పూర్వం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతానికి ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. మంత్రిగా పనిచేశారు అనువార్య కారణాలతో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జననం నవంబర్ 15, 1953 గడుగులపల్లి గ్రామంలో దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. వీరికి సంతానం తుమ్మల యుగంధర్, మోహిని పోపూరి, చంద్రిక వల్లభనేని, ప్రస్తుతం వీరు హైదరాబాదులో నివసిస్తున్నారు. కేవలం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ వస్తున్న మంచి మనసున్న రాజకీయ నాయకుడు అంటూ పలువురు ప్రశంసిస్తూ ఉంటారు. దాదాపు ఎన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్తావనంలో అభివృద్ధి చేయడం తప్ప అవినీతి మరకలు లేని నేతగా పలువురు కీర్తిస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో… ఎందరికో రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన నేతగా ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తో పాటు తెలంగాణ రాష్ట్రం సొంత జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిరంతరం పనిచేసిన మంచి మనసున్న రాజకీయ చాణుక్యుడిగా అభివర్ణిస్తుంటారు రాజకీయాలలో ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. గొడవలకు, కక్షలకు, ప్రాధాన్యత ఇవ్వరు. కోపతాపాలు ప్రదర్శించరు. తోచిన వారికి సాయం చేస్తూ ముందడుగు వేస్తూ వెళుతూ ఉంటారు. సామాజికంగా అందరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ… నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తూ కార్యకర్తలను ధైర్యాన్ని నింపుతూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ మకుటం లేని మహారాజు వలె రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. “తుమ్మల” అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అనే విధంగా నిరంతరం ప్రజల కోసం పరితపించారు. మరిన్ని నిధులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన సేవలు కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు. అవినీతి మరకలేని నేతగా.. ఎందరికో రాజకీయ భిక్షను ప్రసాదించిన.. రాజకీయ నేతగా ఎందరో వారిని ఆదర్శంగా తీసుకెళ్తూ ముందుకు సాగుతుంటారు. మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయాలలో మరింత రాణిస్తూ మరింత ముందుకు సాగాలని ఆశిస్తూ, ప్రజలు ఆశగా ఆయన వైపు చూస్తున్నారు. మరింత అభివృద్ధి సాధించే విధంగా తన ప్రయత్నాలను కొనసాగిస్తారని కోరుతూ .. ప్రజా పాలన కొనసాగిస్తారని ఆకాంక్షిస్తూ.. ప్రజాసేవే లక్ష్యంగా మరింత ముందుకు సాగాలని పలువురు కోరుతున్నారు.
నిస్వార్థ నాయకుడు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ నేతలలో నిస్వార్ధ నాయకునిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పలువురు కీర్తిస్తుంటారు. కేవలం ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతుంటారు. ఎందరికో రాజకీయ ఓనమాలు నేర్పిన నేతగా పలువురు చెప్పుకొస్తుంటారు.
అభివృద్ధి తప్ప కక్షలకు తావు ఇవ్వరు. మంచి వైపే నిలుస్తారు. నిస్వార్ధే లక్ష్యంగా పనిచేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం లో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే పనులను చేశారు. మరిన్ని అభివృద్ధికై నిరంతరం పరితపిస్తున్నారు. అందుకే వీరికి నిస్వార్థ నాయకుడు అన్నారు.
