కూరగాయలు సాగు చేస్తున్న పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 6 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాయ పాలెం గ్రామంలో గిరిజన రైతు బానోత్ కిషోర్ నాయక్ కూరగాయలు సాగు చేస్తున్న టమాట పొలాని సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ చేనేత మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా స్థానిక రైతులతో మంత్రి తుమ్మల మాట్లాడుతూ కూరగాయల పంటలపై రసాయన మందులు తక్కువగా ఉపయోగించి సాగు చేయాలని కోరారు వాణిజ్య పంటలలోని ఒకటైన పామాయిల్ సాగు వల్ల రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు ఆకుకూరలు సాగు చేసే రైతులకు ఆకుకూరలు నిలువ చేయుటకు మార్కెట్లో కొత్తగా వచ్చిన ప్రత్యేకమైన సంచులు ఉపయోగించడం వలన ఆకుకూరలు ఎక్కువ సమయం నిలువ ఉంటాయని అన్నారు.
వాణిజ్య పంటలైన కూరగాయలను నిలువ ఉంచి గిట్టుబాటు ధరలకు అమ్ముకునే విధంగా మరియు మరియు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించి అమ్ముకునే విధంగా కొత్తగా మినీ వ్యాన్లపై కేబుల్ ద్వారా ఏసి లను మార్చుకునే టందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా అందిస్తుందని,వాటిని రైతులు వినియోగించుకోవాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking