“అక్షర ది ప్లానెట్ స్కూల్ పర్మిషన్ ను వెంటనే రద్దు చేయాలి” – బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు.

 

మెదక్ తూప్రాన్ ఫిబ్రవరి 8 ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలోని అక్షర ది ప్లానెట్ స్కూల్ లో గత రెండు నెలల క్రితం డిసెంబర్ నెలలో ఉపాధ్యాయుడు 6 ఏళ్ల పాప పై అత్యాచారం చేశాడు అని అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పిల్లలకు సరైన రక్షణ కల్పించడంలో స్కూల్ యాజమాన్యం విఫలమైనందున, ఇలాంటి హేయమైన చర్యలు పునరావృతం జరగకుండా ఉండాలంటే వెంటనే “అక్షర ది ప్లానెట్ స్కూల్ యొక్క అన్ని పర్మిషన్లు రద్దు చేసి స్కూల్ ని వెంటనే ముసి వేయాలి అని బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అద్యక్షుడు కానుగుల రమణాకర్ అధ్యక్షతన డిమాండ్ చేస్తు మండల విద్యాధికారి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జులు కేతోజి వినోద్,కొండనొల్ల నరేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండల అధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్,ఉప అధ్యక్షుడు కొమ్ము చంద్రం, కార్యదర్శి బుగ్గ స్వామి, కుమార్, స్వామి, సాయి పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking