ఆయిల్ పామ్ పంటలను ప్రోత్సహించాలి –జిల్లా కలెక్టర్ రాజర్షిషా

మెదక్ ప్రాజబలం న్యూస్:- మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం హకీంపేట, ఉప్పు లింగాపూర్ గ్రామాల్లో గురువారం ఆయిల్ పామ్ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల ఆలోచన చేయాలన్నారు.

 


రైతులకు దీర్ఘకాలం లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించేలా అధికారులు కృషి చేయాలన్నారు.
మంచి దిగు బడితో పాటు లాభాలను కూడా ఆయిల్ పామ్ పంట ద్వారా అర్జించ వచ్చున్నారు.
ఆయిల్ పామ్ సాగు కై ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలను, ప్రోత్సకాలను అందిస్తుందని తెలిపారు .
సాగు ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని ,ఆయిల్ పామ్ వేసిన రైతులతో మాట్లాడారు .
ఎంత పెట్టుబడి అయింది,?
ఆయిల్ పామ్ పంటకు వచ్చే తెగుళ్లు ఏమిటి?
ఆయిల్ ఫామ్ మొక్కకి మొక్కకి మధ్య ఎంత దూరం లో మొక్కలు నాటాలి అని రైతులతో మాట్లాడారు.
ఆయిల్ ఫామ్ పంటలలో ఉండే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.


ఆయిల్ పామ్ సాగు కి అనువైన నెలలు ఉన్నాయని ఆసక్తి గల రైతులు సంబంధిత ఉద్యాన శాఖ అధికారి /ఆయిల్ పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ /ఏవో దగ్గర దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.
ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు కై రాయితీ రూ .50918 ఎకరానికి అందిస్తుంది.
పంట మార్పిడి లో భాగం గా ఆయిల్ పామ్ సాగు చేస్తూ అధిక లాభాలు పొందాలని రైతులను ప్రోత్సహించారు.

రైతులు ఎకరానికి మొక్కలకు చెల్లించావలిసినది రూ 1140/-.ఆయిల్ పామ్ సాగు కి నీళ్లు నిలవని ఎర్ర నెలలు ,నల్ల రేగడి భములు అనువైనవి ..ఒక ఎకరానికి 8-10 టన్నుల దిగుబడి పొందవచాన్నరు.
సరైన యాజమాన్యం సాగు పద్ధతులు పాటించి ఎకరానికి రూ 1 లక్ష ఆదాయం పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యాన అధికారి శ్రీ డి .నర్సయ్య ,జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు ,క్లస్టర్ లెవెల్ ఉద్యాన అధికారులు ,ఆయిల్ పామ్ కంపెనీ జిల్లా మేనేజర్ మరియు సిబ్బంది , జిల్లా అధికారులు, మాసాయిపేట్ మండల తహసిల్దార్ జ్ఞాన జ్యోతి, ఆర్ ఐ దన్ సింగ్, మండల వ్యవసాయ అధికారులు , ఎంపీడీఓ ,మండల ప్రత్యేక అధికారి,మండల రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking