ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 8:
గురు వారం జిల్లాలోని కలెక్టరేట్ సమావేశమందిరము లో డి. ఆర్. ఓ. హరిప్రియ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తుది ఓటర్ జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2024 ప్రకారం నమోదులు, తొలగింపులు అనంతరం జిల్లాలో సవరించిన ఓటర్ల జాబితా విడుదల చేసారు. జిల్లాలో 2875907 మంది ఓటర్లుగా నమోదయ్యారని అదనపు కలెక్టర్ తెలిపారు. 10264 మంది యువత కొత్తగా ఓటర్ జాబితాలో చేరినట్లు తెలిపారు. ఇందులో సర్వీస్ ఓటర్లు 715 మంది, దివ్యంగులు 26207 , పురుషులు 1483448 మంది, స్త్రీలు 1392074 మంది , ట్రాన్స్ జెండర్ 385 మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. 80 సంవత్సరాల పై బడిన వయోవృద్ధులు, దివ్యంగులు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే వారికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. మరణించిన వారి ఓట్లను జాబితానుండి తొలగించాలని పార్టీ ప్రతినిధులు కోరగా, ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం తొలగించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టరేటులో నిర్వహిస్తున్న ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో భాగంగా ఈవీఎం, వివి ఫ్యాట్, బ్యాలెట్ బాక్స్ ల పనితీరు ను అదనపు కలెక్టర్ తో కలిసి రాజకీయ పార్టీ ప్రతినిధులు తనిఖీ చేసారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.