గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 25: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జరగనున్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అందరికీ అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగింది.
శనివారం శామీర్పేట కలెక్టరేట్ ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను చేసారు.కలెక్టరేట్ లో జరుపుకోనున్న గణతంత్ర దినోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. పతాకావిష్కరణ మొదలుకొని,సభావేదిక, సభాస్థలి, ఆవరణలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు . అలాగే గణతంత్ర దినోత్సవానికి కలెక్టరేట్కు వచ్చే వీఐపీలు, అధికారులు, మీడియా ప్రతినిధులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటితో పాటు కుర్చీలు టెంట్లు, సభా వేదిక అలంకరణ పనులు పూర్తయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking