మన భారత రాజ్యాంగమే మనకు బలం

 

సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 25:

76వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో భారత రాజ్యాంగం పట్ల ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సింగరేణి భవన్ లోని సందర్శకుల గ్యాలరీలో రాజ్యాంగ ప్రతిని సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్.బలరామ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో రాజ్యాంగమే సర్వ శక్తివంతమైనదని, అదే ప్రజలందరి బలమన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అందరికీ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగ ప్రతిని సింగరేణి భవన్ లోని సందర్శకుల గ్యాలరీలో పొందుపరిచినట్లు వివరించారు. భారత దేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన మహనీయులను ఎప్పుడూ స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డి.ఎం.సుభానీ, జీఎం(మార్కెటింగ్) డి.రవి ప్రసాద్, సింగరేణి భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking