ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గౌతమ్

పోలీసుల గౌరవ వందనం, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 26:
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ఎంతో ముందంజలో ఉందని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం, సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు.
ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శామీర్పేటలోని కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. డి సి పి కోటిరెడ్డి , జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గత సంవత్సర కాలంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి కలెక్టరు తెలియజేశారు. జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి అభివృద్దిలో ముందుంచేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు.

 

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలోని ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కలెక్టర్ గౌతమ్ ప్రశంసాపత్రాలను అందచేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ డి సి పి కోటిరెడ్డి , జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్రెడ్డి, , జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా కలెక్టరేట్ ఏవో రాంమోహన్రావు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking