రాజన్న సిరిసిల్ల జిల్లా, జనవరి -26 (ప్రజాబలం ప్రతినిధి)
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను. నేటి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అమలు చేస్తూ, నూతన రేషన్ కార్డులు అందచేయనున్నది.
రైతు రుణ మాఫీ నాలుగు విడుతల్లో 44 వేల 620 మంది రైతులకు 352 కోట్ల 74 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది.
మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు రూ.73 కోట్ల 41 లక్షల విలువ గల 1 కోటి 95 లక్షల మంది మహిళలు జీరో టికెట్లపై ప్రయాణం చేశారు.
ఇందిరా మహిళా శక్తి మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా “ఇందిరా మహిళా శక్తి” పేరుతో పథకానికి ప్రజా పభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు మన జిల్లాలో 3 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించుకొని, విజయవంతంగా నిర్వహించుచున్నాము.
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 93 వేల 104 మంది కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 7 కోట్ల 35 లక్షల 39 వేల రూపాయల సబ్సిడీ సొమ్ము జమచేయడం జరిగింది.
గృహజ్యోతి కింద మార్చి 1, 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు 9 లక్షల 44 వేల 834 జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం 36 కోట్ల 36 లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసింది.
సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం రూ.900 కోట్లకు పైగా పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ. 75 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజారోగ్యానికి భరోసా జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల ద్వారా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సహాయాన్ని రూ.5 నుంచి రూ.10 లక్షలకు పెంచడం జరిగింది. చందుర్తి, పెద్ద లింగాపూర్ లో పీహెచ్ సీలు ప్రారంభించాం, ఆరోగ్య శ్రీ ద్వారా 13 వేల 861 మంది రోగులకు 33 కోట్ల 63 లక్షల 24 వేల విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది.
నెరవేరిన నేతన్నల కల సిరిసిల్లలోని నేతన్నలకు నేతన్న పొదుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలు అమలు చేస్తున్నది. వివిధ ప్రభుత్వ శాఖల క్లాత్ ఆర్డర్ పెండింగ్ బకాయిలు రూ 379.85 కోట్లను చెల్లించి, అలాగే 66 లక్షల ఆర్వీఎం క్లాత్ ఆర్డర్ కేటాయించడం జరిగింది. రూ.50 కోట్లతో ఏర్పాటు చేసిన యార్న్ బ్యాంక్ విజయవంతంగా కొనసాగుతుంది. స్వశక్తి సంఘాల్లోని మహిళలకు ఒకే రకమైన 4.56 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల నేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
ప్రభుత్వ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి శిక్షణ: ప్రజా ప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్డ్ సెంటర్లుగా అభివృద్ది చేస్తున్నది. జిల్లాలోని 546 ప్రభుత్వ విద్యా సంస్థల్లో 50 వేల 346 మంది విద్యార్థులు చదువుతున్నారు.13 కస్తుర్బాగాంధీ విద్యాలయాల్లో 3 వేలకు పైగా విద్యార్థులకు ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సు, ఎంసెట్ ఇతర పోటీ పరీక్షల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ హాస్టల్ లలో డైట్, కాస్మోటిక్ చార్జీలు ప్రభుత్వం భారీగా పెంచడం జరిగింది. కామన్ డైట్ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందించడం జరుగుతున్నది.పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్ లపై దృష్టి జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్ లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్- 9,10, 11, 12 పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
100 శాతం సర్వే పూర్తి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1 వేయి 531 ఎన్యుమరేషన్ బ్లాక్ ల పరిధిలో 1,92,432 ఇండ్లు సర్వే సకాలంలో పూర్తి చేశాము.
సన్నాలకు 500 బోనస్ జిల్లాలో 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 37 వేల 398 మంది రైతుల నుంచి 2 లక్షల 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రూ.490 కోట్లు చెల్లించడం జరిగింది. అలాగే 12 వందల మంది రైతుల నుంచి 6 వేలకు పైగా మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం సేకరించి, రూ. 3 కోట్ల 8 లక్షల రూపాయలు 5౦౦ అదనపు బోనస్ కింద చెల్లించడం జరిగింది.
ప్రజాపాలన ఉత్సవాలు ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సోమవారం ప్రజావాణిలో విజ్ఞప్తులు స్వీకరించి, వాటిని పరిష్కరిస్తున్నాం. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంతోపాటు అన్ని మండలాల్లో ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్లు కల్లు గీత కార్మికులు చెట్టు నుంచి పడి ప్రమాదాల బారిన పడకుండా ఐఐటీ హైదరాబాద్ అభివృద్ది చేసిన కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్ గీత కార్మికులందరికీ ఉచితంగా అందజేస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే 400 మందికి కిట్లు అందించాం.
ఉచిత చేప పిల్లల పంపిణీ 2024-25 సంవత్సరానికి గానూ జిల్లాలోని వివిధ మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 440 చెరువుల్లో 70.58 లక్షల చేప పిల్లలను 100 శాతం సబ్సిడీపై లక్ష్యానికి గాను 43.69 లక్షల చేప పిల్లలను నీటిలో విడుదల చేశారు.
రోడ్లకు మహర్దశ జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖకు పలు రోడ్ల నిర్మాణానికి రూ. 18 కోట్ల సీఆర్ఆర్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
దివ్య”మైన ఉపాధి ఆర్ధిక పునరావాసం కింద దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మించగా, జిల్లా అధికార యంత్రాంగం ఆద్వర్యంలో 24 మంది దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు ఉపాధి పొందుతున్నారు. 322 మంది దివ్యాంగులకు 674 సహాయ ఉపకరణాలు పంపిణి చేయడం జరిగింది.
యువతకు ఉద్యోగాలు జిల్లాలో 12 జాబ్ మేళాలు నిర్వహించి 1 వేయి 500 మంది నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించడం జరిగింది. దాదాపు 136 మంది స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, బాషా పండితులు, పీఈటీల పోస్ట్ లు, గ్రూప్ -4 కింద 124 మంది పోస్ట్ లు భర్తీ చేయడం జరిగింది.
జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తున్న జిల్లా అధికారులందరికీ, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ సమాచారాన్ని నిరంతరం చేరవేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు. గణతంత్ర వేడుకల సందర్భంగా మీఅందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగించారు.