శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు

 

కీసరగుట్టలో శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా స్వయంగా పర్యవేక్షించిన కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 18: మహాశివరాత్రి సందర్బంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కీసర గుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి వారికి అన్ని వసతులు కల్పించినట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా జాతరకు అంచనా కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తానే స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులు, పోలీసు సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ బ్రహోత్సవాలు జరుగుతున్న కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను జిల్లా అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈనెల 21 తేదీ వరకు జాతర జరగనున్న దృష్ట్యా జాతరలో ఏర్పాటు చేసిన లైటింగ్, ఆవరణలో అలంకరణ, పోలీస్ ఔట్ పోస్టు, క్యూలైన్లు, భక్తులకు అవసరమైన టాయిలెట్లు, మహిళా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వసతులను కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. మహాశివరాత్రి రోజైన శనివారం సాయంత్రం కీసరకు భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వారికి అవసరమైన సదుపాయాలు, ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్, జిల్లా పంచాయతీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతర రోజుల్లో ఆలయం వద్ద వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జాతరలో భక్తులకు నీటి సౌకర్యం ఉండేలా ఆయా చోట్ల తాగునీటి వసతి కల్పించాలని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జాతర సమయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు..ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవి, ఆలయ కమిటీ ఛైర్మన్ రమేశ్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking