డబుల్ బెడ్రూమ్లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి

 

డబుల్ బెడ్రూమ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి అర్హులకు అందచేయాలి

డబుల్ బెడ్రూమ్లపై సమీక్ష సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 17:
జిల్లా వ్యాప్తంగా ఇంకా నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసిన అర్హులైన లబ్ధిదారులకు అందచేయాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎమ్సీ) అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అర్హులైన వారికి అందచేశారు.పనులు జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ల పురోగతి ఎలా ఉంది,ఏఏ స్థితిలో ఉన్నాయనే వివరాలను ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాస మూర్తి, రెవెన్యూ డివిజన్ అధికారులు (ఆర్డీవోలు), సంబంధిత మండలాల అధికారులను అడిగి తెలుసుకొన్నారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌతమ్ సమావేశంలో అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందచేయాల్సిన అవసరం ఉందని,దీనిని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, మండలాల వారీగా మంజూరైన లబ్దిదారులకు అందచేయాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయమై జీహెచ్ఎమ్సీ ఇంజినీర్లను కలెక్టర్ గౌతమ్ వివరాలను అడిగి తెలుసుకొన్నారు. దీనికి సంబంధిత జీహెచ్ఎంసీ ఇంజనీర్లు లబ్ధిదారుల మరణాలు (డెత్ కేసు), లబ్ధిదారుల ఫోన్ నెంబర్లతో నాట్ ట్రేసబుల్, రిజర్వేషన్ కల్పించిన వారికీ కులం (క్యాస్ట్) సర్టిఫికెట్ జారీ పెండింగ్లో ఉండటం వంటి కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించి కలెక్టర్ గౌతమ్ డెత్ కేసులలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులను సంప్రదించి స్పౌస్ కానీ వారి పిల్లల్లో ఒకరి పేరును కుటుంబసభ్యులందరి సమక్షంలో నిర్ణయించి లిఖిత పూర్వకంగా ఆమోదపత్రం పొంది వారి పేరుపై డబుల్ బెడ్రూమ్కు సంబంధించి పట్టా సర్టిఫికెట్ అందచేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. నాట్ ట్రేసబుల్ కేసులలో ర్యాండమైజేషన్లో ఫారం–32లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం లబ్దిదారులను గుర్తించాల్సిందిగా అధికారులకు వివరించారు. అలాగే లబ్ధిదారులకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి త్వరగా జారీ చేయాలని సంబంధిత తహశీల్దార్లు, ఆర్డీవోలను కలెక్టర్ గౌతమ్ సమావేశంలో ఆదేశించారు. జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకొని… అందుకు అవసరమైన సలహాలు, సూచనలను కలెక్టర్ గౌతమ్ సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాసమూర్తి, ఆర్డీవోలు …. జీహెచ్ఎంసీ ఇంజనీర్లు, ఆయా మండలాల తహశీల్దార్లు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking