ఆర్ టీ సీ అధికారులకు, బస్ డ్రైవర్లకు, కండక్టర్లకు ప్రజలందరూ సహకరించాలి వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యులు
మణికొండ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రజల వద్దకే ఆర్ టీ సీ అనే నినాదంతో వారు ముందుకు వచ్చి ప్రజాసేవకై 47/వై.ఎమ్ నెంబర్ బస్ మంచిరేవుల, నార్సింగి, పుప్పలగుడా, మనికొండ, హుడా కాలనీ, బంజారా హిల్స్ నుండి సికింద్రాబాద్ వరకు 32 ట్రిప్పులు ప్రజల సౌకర్యాయార్థం నడిపిస్తున్నారని ఈ విషయమై ఆర్ టీ సీ అధికారులకు, బస్ డ్రైవర్లకు, కండక్టర్లకు ప్రజలందరూ సహకరించాలని వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యులు అందరూ కలసి ప్రజానీకానికి విన్నవిస్తూ వారి ఆధ్వర్యంలో శుక్రవారము రోజు 12 వ తేదీ ప్రొద్దున 9 గంటలకు ఆంధ్ర బ్యాంక్ (ప్రస్తుత యూనియన్ బ్యాంక్) చొరస్తాలో ప్రజా ప్రాయోజనంగా జరుప బోయే సమావేశానికి ఆర్ టీ సీ అధికారులు రీజనల్ మేనేజర్ వెంకన్న, డివిజనల్ మేనేజర్ అపర్ణ కల్యాణి, మేనేజర్ లక్ష్మీ ధర్మా, సీ ఆర్ సీ ధర్మేంద్ర, సేఫ్టీ వార్డెన్ లక్ష్మణ్ ఆదిగా పాల్గొంటారని కావున ఈ సదవకాశాన్ని మణికొండ నివాసులు ఉపయోగించు కొని వారి వారి అనుభవాలను అధికారుల ముందు వ్యక్త పరుస్తూ అమూల్యమైన ప్రజా ప్రయోజనకర సందేశాన్ని తెలియ పర్చాలని వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యులు ప్రజానీకానికి తెలియజేస్తూ, ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో మణికొండ ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని జయప్రదంగా నిర్వహించేటట్లు తోడ్పడాలని, ఆర్ టీ సీ అధికారులకు మనికొండ ప్రజలు అన్ని విధాల సహకరిస్తారని ప్రజల తరపున అధికారులకు హామీ ఇవ్వడం జరిగినదని తెలియ పరుస్తున్నాము, ధన్యవాదాలతో వీ ఆర్ ఫర్ యు.