జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
విద్యార్థులు ఆంగ్లంపై మొహమాటం వీడాలి
తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపాలి
నిర్విరామ కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధ్యం అవుతాయి
వుయ్ కెన్ లెర్న్ ఇంగ్లీష్ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఖమ్మం ప్రతినిధి మార్చి15 )ప్రజాబలం) ఖమ్మం జిల్లా కొణిజర్ల విద్యార్థులు మొహమాటం వీడి ఆత్మ విశ్వాసంతో అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు కొణిజర్ల మండలం పెద్దమునగాల జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వుయ్ కెన్ లెర్న్ ఇంగ్లీష్ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ పాఠశాలలో వుయ్ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ప్రారంభించడం 3 నెలల కాలంలో విద్యార్థులలో మంచి మార్పును ఉపాధ్యాయులు సాధించడం చాలా గర్వంగా ఉందని అన్నారు. మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా ఆత్మ విశ్వాసంతో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడే విధంగా తయారు చేయాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రూపోందించామని అన్నారు చిన్నతనంలో పాఠశాలలో గ్రామర్ తో సహా ఆంగ్లం నేర్పేవారని, ప్రస్తుతం పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ఆంగ్లంపై ఉండే భయం పిల్లల్లో తొలగించేలా చర్యలు చేపట్టామని అన్నారు. మన దగ్గర ఉన్న క్షమత ఇతరులకు కమ్యునికేట్ చేసేందుకు సాధనంగా ఆంగ్లం ఉపయోగ పడుతుందని అన్నారు ఆంగ్లం మాట్లాడటంలో 3 నెలల కాలంలో విద్యార్థులలో మంచి మార్పు కనిపించిందని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు బాగా పని చేస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంతా మన పిల్లలు అనే దృక్పథంతో జిల్లా విద్యా శాఖ, ఉపాధ్యాయులు, జిల్లా యంత్రాంగం పని చేస్తుందని అన్నారు పిల్లలకు మంచి విద్య అందించడమే ప్రభుత్వం యొక్క అత్యంత ప్రధాన కర్తవ్యమని అన్నారు.

తల్లిదండ్రులకు వివిధ కారణాల వల్ల చదివే అవకాశం లభించలేదని, పిల్లలు పెద్ద స్థాయిలో ఉండాలని ఆశించి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తున్నారని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పిల్లలు బాగా చదువుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించు కోవాలని కలెక్టర్ విద్యార్థులను కోరారు. పోలీస్, టీచర్, డాక్టర్, శాస్త్రవేత్త, కలెక్టర్ వంటి గొప్ప స్థాయికి ఎదగాలని అన్నారు. ఒక బుక్ లో మన లక్ష్యాన్ని రాసుకోవాలని, ప్రతి రోజూ ఆ లక్ష్యాన్ని గుర్తుంచు కోవాలని అన్నారు. మన లక్ష్యం దిశగా రోజు వారి కృషి చేస్తేనే ఫలితం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు ఒక రోజులోనే ఏది సాధ్యం కాదని రెగ్యులర్ గా చదివితే ఫలితాలు వస్తాయని అన్నారు. మనకు ఆంగ్లం ఒక రోజులోనే రాదని భయం మొహ మాటం లేకుండా ఇతరులతో, ఫ్రెండ్స్ తోటి మాట్లాడటం ప్రారంభించాలని, తప్పులను సరి చేసుకుంటూ ఉండాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజూ కొంత సమయం ఆంగ్ల కథ పుస్తకాలు చదవాలని కలెక్టర్ అన్నారు పాఠశాల సిలబస్ లో స్పోకెన్ ఇంగ్లీష్ లేకపోయినాఉపాధ్యాయులు మన కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ నేర్పిస్తున్నారని అదే విధంగా మన జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత మరో 10 మందికి మనం సహాయం చేయాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా పని చేస్తున్నాయని, ప్రభుత్వ విద్యా సంస్థలు మా పిల్లలు బాగుండాలి అనే సంకల్పంతో నడుస్తున్నాయని, తల్లి దండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపాలని కలెక్టర్ కోరారు ఈ సందర్భంగా వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమస్యలు ఇంకనూ చేపట్టాల్సిన సౌకర్యాల గురించి అడిగారు. పేరెంట్స్, టీచర్స్ సమావేశాలకు ఖచ్చితంగా హాజరుకావాలని, పిల్లల చదువుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, మండల విద్యాధికారి అబ్రహం, అకడమిక్ మానిటరింగ్ అధికారి కె. రవి కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, ఇంచార్జ్ తహసీల్దార్ జి. రాము, టీచర్లు, ఎన్.జి.ఓ. ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు