మాదిగలను మోసం చేసిన నంబర్ వన్ మోసగాడు రేవంత్ రెడ్డి

👉 ప్రజా పాలనలో మాదిగల బతుకులు బజారున పడ్డాయి.
👉మైసగళ్ళ బుఛ్చేంద్ర మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు.

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 15(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు 5 వ రోజు కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే నిరసన దీక్షలు సాడాకుల కృష్ణ మాదిగ ఎంఎస్పి సీనియర్ నాయకులు అధ్యక్షతన జరుగుతున్న దీక్షలకు ముఖ్యఅతిథిగా హాజరైన మైసగళ్ళ బుఛ్చేంద్ర మాదిగ ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చట్టాన్ని ఆమోదించకుండా ఉన్నత ఉద్యోగాల ఫలితాలను వెల్లడించి.. మాలలతో పెట్టుకుంటే తన సీఎం పదవికి ముప్పు వస్తుందని పిరికివాడిలా భయపడి.. మొదటినుండి తనకు అన్ని విధాలుగా అండగా ఉండి రాజకీయంగా ఎదగడానికి బిక్ష పెట్టిన మాదిగ జాతిని మోసం చేసిన మోసగాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు చేసి మాదిగ జాతికి న్యాయం చేస్తానని నిండు శాసనసభలో మాట్లాడి, నేడు దాన్ని విస్మరించి దగకోర్ ముఖ్యమంత్రిగా మాదిగ జాతిని విస్మరించి మాలలకు ఒత్తసు పలికిన సందర్భంగా ఇట్లాంటి నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఇకనైనా సోయి తెచ్చుకొని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి ప్రతి ఉద్యోగంలో మాదిగలకు రిజర్వేషన్ల వాటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నము లేని పక్షంలో మాదిగల ఆగ్రాహనికి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్తు చేస్తున్నాముఈ కార్యక్రమంలో పెద్ద గీత మాదిగ ఎంఎంఎస్ రాష్ట్ర నాయకురాలు గంధ గల వీరయ్య మాదిగ ఎంఎస్పి జిల్లా గౌరవాధ్యక్షులు, బూడిద నవాజ్ మాదిగ సీనియర్ నాయకులు, గంగేరి శ్రీనివాస్ మాదిగ సంగారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు, కాశీపురం ఆంజనేయులు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, కంది ప్రవీణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిన్నారం మండల అధ్యక్షులు, కోలుకుందా మోహన్ మాదిగ సదాశివ్పేట్ మండల్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు, ఈదుగాని లింగం మాదిగ రాకేష్ మాదిగ, అంతాయిపల్లి రాములు మాదిగ, నడిమింటి నరసింహులు మాదిగ, శాంతయ్య మాదిగ, జనార్దన్ మాదిగ లక్ష్మయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking