సేవాభావంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

 

ఎస్సీ బాలికల వసతి గృహానికి వాటర్ ప్యూరిఫైయర్ అందజేత

ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ భూపెల్లి మల్లన్న

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 15 : ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు రావాలని,మనకున్న దాంట్లో ఎంతోకొంత ప్రజాసేవకు కేటాయించాలని ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ భూపెల్లి మల్లన్న పేర్కొన్నారు.శనివారం మంచిర్యాల దళిత అభివృద్ధి శాఖ పరిధిలో గల ఎస్సీ బాలికల వసతి గృహంలో బాలికల కోసం మంచినీరు అందించేందుకు మండలంలోని పోతపల్లి గ్రామానికి చెందిన భూపెల్లి మల్లన్న తన సొంత ఖర్చుతో వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సేవ చేయడం ద్వారా మనిషికి పుణ్యం లభిస్తుందని అన్నారు.సేవ చేసే స్థాయికి ప్రతి ఒక్కరు ఎదగాలన్నారు.సేవ చేయడం ద్వారానే జీవితానికి సార్ధకత లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలోఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి,ఏఎస్ డబ్ల్యూఓ,హెచ్ డబ్ల్యుఓ చందన,వరుణ్, జనార్ధన్,కల్పలత,శ్యామల, పావని,ప్రసన్న రాణి,హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking