ఆసుపత్రి లోని అన్ని విభాగాల పరిశీలన.
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా నియోజకవర్గం
19.10.2024:
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పీ.హెచ్.సీ ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు.
ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని ఆరా తీశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.