దళితులపై దాడి చేసినవారిని వెంటనే అరెస్ట్ చేయాలి

 

అట్రాసిటీ కేసు నమోదైనా నేటికీ అరెస్ట్ చేయలేదు

ప్రజా నాయకుల నీడలో నిందుతులు

 

ప్రజబలం అక్టోబర్ 19 కుల్చారం మండలం

మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో దళితులపై జరిగిన సంఘటన హే్యమైన చర్య అని సీ పీ ఏం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు ఎం ఆర్ పీ ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పురే ప్రభాకర్, జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచారం కార్యదర్శి అక్కుల పెంటయ్య అన్నారు. శనివారం దాడికి గురైనా దళితులతో వారు కలిసి, విలేకర్లతో మాట్లాడుతూ ఒకవైపు అంతరిక్షంలోకి వెళ్తున్న సైన్స్ ఒకవైపు ఉంటే నేడు గ్రామాలలో అంటూ ముటు అంటూ దళితులపై నేటికీ దాడులు నిర్వహిస్తూ మానసికంగా శారీరకంగా హింసిస్తున్న సందర్భలు అనేకం జరగడం సిగ్గుచేత్తన్నారు. కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో బతుకమ్మలు ఆడుతున్న సందర్భంలో కరెంట్ పాయిందని ఫోన్ టార్చ్ వేసుకొని పక్కనుండి వస్తున్న దళిత యూవకుడు రమేష్ నీ అమ్మాయి ఫోటో తీసావు అంటూ భూతుమాటలు తిడుతూ భౌతిక దాడి చేయడం సరైనదికాదని వరన్నారు. తన కొడుకుని ఎందుకు కొడుతున్నారు ఎందుకు తిడుతున్నారని అడగడానికి వచ్చిన రమేష్ తండ్రి పై కూడా భూతుమాటలు తిట్టడంతో అక్కడినుండి వారింటికి వెళ్లిపోయిన వెంటాడి వెంటాడి దళితుల ఇండ్లలోకి చొరబడి కొట్టడం ఏంటని ప్రశ్నించారు. చుట్టుప్రకళ ఉన్న తోటి దళితులు అడిగిస్తే మీ మాదిగ లంజకొడుకులకు బాగా ఎక్కువైంది ఏమి పీకుతారురా అంటూ రాళ్లతో, కట్టెలతో ఐలి రాములు, నవీన్, కిరణ్, నరేష్, కషర్ల గోపాల్, ధర్జన మల్లమ్మ లు చిన్నలచికారీ శేఖయ్య, ధనయ్య, దేవయ్య, సౌందర్య, పాపవ్వ, రమేష్ పై పిడి గుద్దులు గుద్దుతూ, రాళ్లతో, కట్టెలతో దాడిచేసారన్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ వారు వీడియోస్ తీస్తుంటే ట్యాబ్లు గుంజుకునే ప్రయత్నం చేయడం అంటే ఎంతగా కసితో దళితులపై దాడి చేసారో అర్ధం అవుతుందాన్నారు. గ్రామంలో కులాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించిన స్థానిక తాజా మాజీ సర్పంచ్ ఇరువర్గాలకు నచ్చచెప్పి మాట్లాడాలిసిపోయి నిందితుల పక్షాన రాజకీయ నాయకులతో కలిపిస్తూ అండగా నిలబడటం దూర్మార్గమన్నారు. బాధితులను పరామర్శించాల్సిన ప్రజా ప్రతినిధి ఇలా చేయడం సిగ్గుచేట్టన్నారు. నిందితులపై 11వ తేదీన ఏసి ఎస్ టి అట్రాసిటీ కేసు నమోదైనా నేటివరకు ఎందుకు అరెస్టు చేయలేదో అధికారులు చెప్పాలని డిమాండ్ చేసారు. నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట, కొల్చారం, వెల్దుర్తి అన్ని మండలంలో దాడులు జరుగుతున్న అధికారులు అవగాహనా సాధస్సులు జరపాకపోవడం వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మండిపడరు. కావున వెంటనే కేసు నమోదైనా నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమైండ్ కు పంపాలని డిమాండ్ చేసారు లేని పక్షంలో పెద్ద ఎత్తున్న ప్రజా, దళిత సంఘాలతో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో దళిత జర్నలిస్టులు జైపాల్ ఎం ఆర్ పీ ఎస్ సంజీవులు, దళితులు దుర్గయ్య, పాపయ్య, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking