కావాలనే మా కుటుంబం పై కక్ష్య గట్టి దుష్ప్రచారం చేస్తున్నారు
అభిరామ్ అనే వ్యక్తి నుండి మాకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి భాదితులు
నార్ల మాల్పురు
ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు ఖానాపురం వాస్తవ్యులు నార్ల మల్పూర్ మాట్లాడుతూ మా కుమార్తె అయిన నార్ల మౌనిక మీద చేసిన ఆరోపణలు సరైనవి కావని చైన్ సిస్టం లో పెట్టిన డబ్బులను మాకు ఇచ్చినట్లుగా చూపించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు . మౌనిక ఎస్టేట్ లేదని అది ఒక ఫారం అని అది ఓన్లీ బ్యాంక్ ఎకౌంట్ అని అన్నారు . ఆబరణ జ్యూయలరి మరియు సురక్ష ట్రేడింగ్ పేరుతో బారి మోసం చేసి బోర్డు తిప్పేసిన కంపెనీ చూపించి ఏమి తెలియని అమ్మాయిని అనవసరంగా దీంట్లోకి లాగి మా పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు . మాయ మాటలు చెప్పి , మోస పూరితంగా ఆడపిల్లను అడ్డుపెట్టుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు . ప్రతి ఒక ఆధారాలు మా దగ్గర ఉన్నాయని ఇదంతా కావాలని చేస్తున్నారని అన్నారు . సురక్ష ట్రేడర్స్ ద్వారా పెట్టుబడి పెట్టిన నగదుకు ఆర్నెళ్లలో రెట్టింపు ఇస్తామని ఆశ పెట్టగా అభిరామ్ టీం ద్వారా 40 లక్షలు కట్టారని ఆ తర్వాతకి కంపెనీ మూసివేశారని . ఖానాపురం పోలీస్ స్టేషన్లో కంపెనీ పేరు మీద ఎఫ్ఐఆర్ అయిందని ఆ తర్వాత కి పోలీసు వారు పిలిపించి అడగగా సురక్ష ట్రేడర్స్ కంపెనీ ద్వారా 14 లక్ష రూపాయలు వచ్చినయని మిగతా డబ్బుల కోసం నార్ల మౌనిక ను బలవంతంగా ఒత్తిడి చేయగా 100 బాండ్ పేపర్ మీద నవంబర్ 10వ తారీకు ఇస్తామని పోలీసు వారి సమీక్షంలో రాసిచ్చామని దీంతోపాటు రెండు ఎంప్టీ చెక్కులు మరియు 10 లక్షల రూపాయలు ఇచ్చామని అన్నారు . ఈ నెల 25వ తారీఖున మా కుమార్తె అయిన నార్ల మౌనిక ది పూల పండ్లు జరుగుతున్న సమయంలో కావాలని గోరింట్ల అభిరామ్ అనే వ్యక్తి ఇంటి దగ్గరికి సంబంధం లేని వాళ్ళని ఇంటికి తీసుకువచ్చి దుర్భాషలాడుతూ గొడవ చేశారు . దాంతో పెళ్లి ఆగిపోయిందని మా పిల్ల భవిష్యత్తు ఆగం చేశారని , మా పిల్ల సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు . తెలుసుకొని కావాలని వచ్చి మా పరువు కి భంగం కలిగించారని పేర్కొన్నారు . నా పిల్లకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఎవరికి జరగకుండా ఉండాలంటే వారి పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు . నా కుటుంబానికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా చూడగలరు . నాకు నా కుటుంబానికి ఏది జరిగినా దానికి బాధ్యులు వారే అని తెలిపారు . మీరు రెండు కోట్ల రూపాయలు పెట్టామని ఆరోపించారు కదా అది నిజమే అని నిరూపించగలరా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం . నేలకొండపల్లికి చెందిన వాసం రాధాకృష్ణ అనే వ్యక్తికి దీనికి సంబంధం లేకపోయినా ఉన్నట్టుగా సృష్టించారని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో సుజాత , వెంకన్న , వీరబాబు , మంగయ్య తదితరులు పాల్గొన్నారు .