శ్రావణి తీరుతో బీజేపీలో పెరుగుతున్న అసమ్మతి ..!

 

సీనియర్లను,క్యాడరును పట్టించుకోని వైనం

బి.ఫామ్ మార్చేవరకు పోరు తప్పదట

జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 27:(ప్రజా బలం)సిద్ధాంతాలకు లోబడి నడిచే బిజెపి రాష్ట్ర శాఖ తీసుకొన్న ఒక నిర్ణయం జగిత్యాల బీజేపీలో ఆశ్చర్యాన్ని నెలకొల్పగా బిజెపి జగిత్యాల అసెంబ్లీ బరిలో అభ్యర్థిగా ఎంపికైన బోగ శ్రావణి తీరుతో నియోజకవర్గ బిజెపి నేతల్లో, శ్రేణుల్లో అసమ్మతి పెంచుతూ జగిత్యాల జనంలో చర్చలకు దారితీస్తున్న సంఘటనలివి. జగిత్యాల అసెంబ్లీ బరిలో బిజెపి అభ్యర్థిగా గత కొన్ని పర్యాలుగా పోటీ చేస్తున్న ముదుగంటి రవీందర్ రెడ్డిని కాదని ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన శ్రావనికి బిజెపి టిక్కెట్టు ఖరారైంది. బీజేపీ నేతలు, శ్రేణులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నైజం కలిగివుంటారని తెలిసిందే. ఈ క్రమంలో బిజెపిలో చేరిన శ్రావణి బీఆర్ఎస్ పార్టీ పక్షాన జగిత్యాల మునిసిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఇదే బిజెపి నేతలు అవినీతి ఆరోపణలపై నిరంతర పోరాటం చేశారు. ఒక రకంగా బీజేపీ చేపట్టిన ఆందోళనలతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు శ్రావనికి మధ్య విభేదాలకు ఒక కారణమంటున్నారు. ఇంతటి నేపథ్యంలో శ్రావణి బీజేపీలో చేరినా పాత ముచ్చట్లను, ఆరోపణలను పక్కనబెట్టి జగిత్యాల బిజెపి నేతలు, క్యాడరు స్వాగతించారన్నట్లు పార్టీ శ్రేణులే అంటున్నారు. ఇక జగిత్యాల బిజెపి అసెంబ్లీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర పార్టీ బోగ శ్రావణి పేరును ప్రకటించగా కొందరు బిజెపి కౌన్సిలర్లు, సీనియర్ నేతలు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లు బిజెపి క్యాడరే అంటున్నారు. కొత్తగా పార్టీలో చేరి పోటీలో నిలుస్తుండగా సపోర్ట్ చేస్తున్నా పాత సీనియర్లను, క్యాడరును బేఖాతరు చేస్తూ తనదారిలో ప్రచారాన్ని శ్రావణి కొనసాగిస్తుండడం బిజెపి పాత క్యాడరులో ఆగ్రహావేశాలు నెలకొని అసమ్మతి కుంపటిని రాజేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా గత బిజెపి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన ముదుగంటి రవీందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి శ్రావణి కి బి ఫామ్ ఇస్తే ఊరుకునేది లేదంటూ పరోక్ష హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇదే ప్రెస్ మీట్లో జగిత్యాలలో బిజెపి టిక్కెట్ శ్రావనికి ఇచ్చింది గెలిచేందుకు కాదని మరోపార్టీ అభ్యర్థి గెలుపు కోసం చేస్తున్న కుట్ర అని ముదుగంటి రవీందర్ రెడ్డి ప్రకటించడంతోనే అనేక అనుమానాలు తావిస్తోంది. ఈ ప్రకటన వెనుక ఎంపీ స్థానంలో కవితను ఓడించిన తరహాలోనే జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ ను ఓడించేందుకు చేస్తున్న మరో ప్రయత్నమా అన్న అనుమానాలు జగిత్యాల జనంలో వినిపిస్తున్నాయి. ఇదే అంతర్గత కారణమై బీజేపీ అభ్యర్థి శ్రావణి ఎవరిని కలుపుకొని పోకపోవడం ఒక కారణమై వుంటుందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలావుంటే శ్రావణి కుటుంబీకుల్లో కొందరు గర్జుకు బిజెపి క్యాడరు పనిచేస్తుందని అంటున్న కామెంట్లు బిజెపి శ్రేణుల్లో అసమ్మతిని మరింతగా రాజేస్తునట్లు క్యాడరులోనే వినిపిస్తోంది. జగిత్యాల అసెంబ్లీ పరిధిలో మిగతా ఇతర రాజకీయ పార్టీలకు సమాంతరంగా తయారైన బిజెపి క్యాడరును బిజెపి అభ్యర్థి శ్రావణి విస్మరించడం వెనుక వాళ్ల వ్యూహమెంటో అర్థము కావడం లేదంటూ రాజకీయ విశ్లేషకులు ఆలోచనల్లో పడుతున్నారు. మరికొందరైతే నామినేషన్ నాటికి క్లారిటీ వస్తుందన్న అభిప్రాయాలు కూడా ఆలోచనలకు పదును పెడుతున్నాయి. ఏది ఏమైనా ట్రయాంగిల్ పోటీలో ఎవరి సత్తా వారు చూపిస్తారా అన్నది వేచిచూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

Breaking