స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటలు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి

అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం స్ట్రాంగ్ రూం వద్ద 24 గంటల పటిష్ట బందోబస్తు చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు శుక్రవారం అదనపు కలెక్టర్, సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో ఏర్పాటుచేసిన వైరా నియోజకవర్గ ఇవిఎం స్ట్రాంగ్ రూం ను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైరా నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ సిసి కెమెరాల ఏర్పాటు చేసినట్లు, ఏర్పాటు చేసిన ప్రతి సిసి కెమెరా పనిచేయునట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 24 గంటల పోలీస్ పహారా ఉండాలన్నారు. తహసీల్దార్ ప్రతిరోజు స్ట్రాంగ్ రూమ్ సందర్శించి, భద్రతా ఏర్పాట్లు పరిశీలించాలన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అనంతరం వైరా తహసీల్దార్ కార్యాలయం నుండి జిల్లాలోని అందరూ తహసీల్దార్ లతో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. శనివారం సాయంత్రం లోగా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు ఈ సందర్భంగా వైరా తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీకాంత్, అధికారులు తదితరులు వున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking