– ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ క్షేత్ర సర్వే నివేదిక ఆధారంగా ఇండ్ల కేటాయింపు
సెక్రటేరియట్ ప్రజాబలం ప్రతినిధి 25, సెప్టెంబర్ 2024:
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి లో భాగంగా నిర్వాసితులయ్యే సుమారు 15 వేల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించింది.
ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూసీ రివర్ బెడ్ , దాని బఫర్ జోన్‌లకు సంబంధించి క్షేత్రస్థాయి సర్వే నిర్వహించామని, రెండు బఫర్ జోన్‌లలో సుమారుగా 15,000 గృహాలను గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ప్రభుత్వానికి నివేదించారు.
మూసి నదీ గర్భం, దాని బఫర్ జోన్‌లోని నివాస యూనిట్లలో నివసించే చాలా కుటుంబాల ప్రజలు ఆర్థికంగా పేదలు కాబట్టి, ఈ కుటుంబాలకు సంబంధిత జిల్లా కలెక్టర్ల ద్వారా మానవతా ప్రాతిపదికన GHMC ప్రాంతంలో 2BHK కేటాయించాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్
ప్రభుత్వానికి నివేదించారు.
స్పందించిన ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తూ ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాల కు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు.