రాజాధికారం ఆజాధికా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం జూలై 4 శ్రీ అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలను ఒక సంవత్సరం పాటు జరపాలని నిర్ణయించామని ది క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు చెప్పారు శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సంవత్సరం పాటు జరిగే ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భీమవరంలో కాoస్యo విగ్రహంతో అల్లూరి సీతారామరాజు 125 జయంతి సంబరాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ భీష్మ భూషణ్ హరి చందన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ,మెగాస్టార్ చిరంజీవి అల్లూరికి ఘన నివాళులు అర్పించారని ఆయన తెలిపారు 30 అడుగుల కాoస్యo విగ్రహాన్ని బహుకరించడం జరిగిందని ఆయన తెలిపారు జూలై 4వ తేదీన అల్లూరు సీతారామరాజు 25 జయంతి ఉత్సవాలను జరపడం జరుగుతుందని ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి మురుము, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గవర్నర్ తమిళసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతులుగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నడిపెల్లి నాని రాజు కార్యదర్శి ఉపాధ్యక్షులు సత్యనారాయణ రాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు