రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 14 ఎప్రిల్ 2024:
డాక్టర్ బాబా సాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా మణికొండ మర్రిచెట్టు కూడలిలో జంట జయంతి కార్యక్రమములు నిర్వహించుకున్న శుభ సందర్భంగా వీఆర్4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇరు కార్యక్రమములలో విచ్చేసిన అతిథులకు, కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజానికానికి, రహదారి బాటసారులకు చల్లటి చిక్కటి మజ్జిగతో పాటు హల్దీరాం కట్టా మీట తిను బండారం ప్యాకెట్లను వితరణ గావించడం జరిగినదని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలుపుతూ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జై భీం అభిమానులు తది తరులతో కలసి వీ ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు కోశాదికారి దిలీప్ కక్కడ్, సంఘా సభ్యులు మోహన్ కుమార్ పానిగ్రహి, నారోత్తం సింగ్, ఆనంద్ విశ్వకర్మ పాల్గొని భారత రత్న అవార్డు గ్రహీత అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలంకృతుని గావించి, హృదయ పూర్వక నివాళులు అర్పించి వారి జీవతం లోని కొన్ని ఘట్టాల గురించి క్లుప్తముగా: సామాన్య కుటుంబంలో జన్మించి, ఒక న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, అన్నిటికంటే మిన్నగా భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుందనీ, అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నవని, దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధు డాయన అని ఆయన జీవన విధానాన్ని కొనియాడుతూ యువత అతన్ని మార్గదర్షణముగా తీసుకోవాలని చెబుతూ, అందరూ కలసి ముక్త కంఠంతో జై భీమ్ నినాదాలతో కూడలి మొత్తం దద్దరిల్లెలా హోరెత్తించి కార్యక్రమాలను సఫలీకృతం గావించినారు.
