మాల మాదిగల ఐక్యతతోనే అంబేద్కర్ ఫలాలు మాల మహనాడు జిల్లా అధ్యక్షులు శ్రీహరి

 

జగిత్యాల, మార్చి 1: మాల మాదిగల ఐక్యతలోనే అంబేద్కర్ మహనీయుడు ప్రసాదించిన ఫలాలు దళితులకు దక్కుతాయని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అన్నారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శిగా పంగ పుష్పాలత నియామకానికి శ్రీహరి చేపట్టారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అద్యక్షులు చెన్నయ్య ఆదేశాలతో నియామకాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే కోడిపెళ్లి రాకేష్ ను జిల్లా యువజన ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు పేర్కొన్నారు. స్వార్థం కోసం రాజకీయ పార్టీలు దళితులను కేవలం ఓట్ల కోసం వాడుకొంటున్నారన్నారు. నేడు రాజ్యాంగానికి రక్షణ కరువైందని దళిత ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు చేయలేని పరిస్థితి ప్రభుత్వానికి దాపరించిందన్నారు. రాబోయే రోజుల్లో మాల మాదిగలు ఐక్యం గా ఉంటే దళితుల హక్కులను సాధించుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల మహేష్, యువజన ప్రధాన కార్యదర్శి ఎర్ర గోకుల కీర్తి కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్ర రాజు, జనరల్ సెక్రెటరీ చింతకుంట్ల గంగాధర్, మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు కోడిపెల్లి విష్ణు, రూరల్ మండల అధ్యక్షులు రాకేష్, మండల అధ్యక్షురాలు అటుకుల సులోచన, జమున, నాయకులు తరాల చిన్న, గంగన్న, కోడిపెళ్లి రాజు, సాయి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking