_ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం
_
ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ గంగారాం
జగిత్యాల, మార్చి 1: ఎస్సి వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగాలు మరువలేనివాని, వర్గీకరణ సాధించి అమరులకే అంకిటమిస్తామని ఎంఎస్పీ జగిత్యాల జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం అన్నారు. బుధవారం మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని స్థానిక మునిసిపల్ పార్క్ వద్ద అమరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేసిన నిర్లక్ష్యం వల్ల వర్గీకరణ పోరులో సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతి మాదిగలను ఎందరినో ఉద్యమ వీరులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ 8 ఏండ్లు గడిచాయన్నారు. వర్గీకరణ పై ఉభయ సభల్లో మాట్లాడకుండా మాదిగలను ఓటు బ్యాంకుగా ఎన్నికల సందర్భంలో వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తూ వస్తున్నారని ఆయన అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మౌనం వీడి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే మాదిగల చిరకాల కోరిక ఐన ఎస్సీ వర్గీకరణ బిల్లును రాబోయే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదింప చేయాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాలు ఇంకా ఉదృతం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించి మాదిగ అమరవీరులకు అంకితం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషల్ పార్టీ కో కన్వీనర్ బెజ్జంకి సతీష్ మాదిగ, దుమాల రాజ్ కుమార్, ఎస్సీ ఎస్టీ అట్రాసిక్ మాంటింగ్ కమిటీ మెంబర్ ధరూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు జగిత్యాల నియోజకవర్గ మహాజన సోషలిస్ట్ పార్టీ కన్వీనర్ బోనగిరి కిషన్ మాదిగ, దుమాల గంగాధర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నక్క గంగారం, మానవ హక్కుల కమిషన్ నెంబర్ మహాజన సోషలిస్ట్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం కోకన్వీనర్ మీసాల సాయిలు, బిరుదుల గంగారాం, జగిత్యాల అర్బన్ మండల ఇంచార్జ్ బిరుదుల శ్రీనివాస్, రేగుంట అంజి, ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి దుమాల గంగాధర్, దుమాల రాజయ్య, నరసయ్య, కట్కూరి సాయన్న, రాజం, గంగాధర్, రమేష్, రాజేందర్, రవి, రమేష్, తదితరులు ఉన్నారు.