అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి లక్షెట్టిపేట అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు బొనగిరి కుమార్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14: అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రజలందరూ నడవాలని అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు బోనగిరి కుమార్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్132 వ జయంతిని పురస్కరించుకొని ఊత్కూర్ చౌరస్తా వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు బోనగిరి కుమార్ మాట్లాడుతూ…బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,అగ్రవర్ణ పేదలకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు, అధికారాలు ప్రసాదించారని కొనియాడారు.ఆయన రచించిన రాజ్యాంగం సక్రమంగా అమలు కావాలంటే బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనార్టీలు రాజ్యాధికారం సాధించాలని కోరారు.బాబా సాహెబ్ ఆలోచన విధానం,ఆయన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరిచే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు దొంత నరసయ్య మాట్లాడుతూ…బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజానికి ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఆయన అడుగు జాడల్లో నేటి యువత ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.అనంతరం అన్ని పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి వందనం చేశారు.అంతకుముందు సామాజిక ఆసుపత్రి లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పెండెం సతీష్, ఉపాధ్యక్షులు బిరుదుల సత్యనారాయణ,కండె మొగిలి,నరేష్,నాయకులు పెరుగు తిరుపతి,రాందాస్,ధర్మన్న,సుద్దాల బాపు,అధిక సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking