బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్
పెద్దపల్లి ప్రజాబలం ఏప్రిల్ 14÷
భారత ప్రజాస్వామ్య మూలాలు విజయవంతం అవుతున్నాయంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ తెలిపారు పెద్ద పెళ్లి పట్టణంలో 132వ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి కారుపాకల సరోజ నేతృత్వంలో కేక్ కట్ చేసి మానసిక వికలాంగుల పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అట్టడుగు వర్గాల ప్రజలైన క్షుద్ర, అతిశూద్ర వర్గాల వారికి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ సమానత్వం, సౌబ్రతత్వం కల్పించారని తాడూరి శ్రీమన్నారాయణ పేర్కొన్నారు దేశంలో కనిపించని కుట్రలో భాగంగా అసమానతలు, వివక్షత కొనసాగుతున్నాయని ఆవేదన చెందారు. ఆర్థిక అసమానతల వల్ల ధనిక,మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు దారిద్ర రేఖ దిగువకు చేజారి పోతున్నారని పేర్కొన్నారు, దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి కురవడం వల్లనే 40 కోట్ల మంది అర్ధాకలితో జీవిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ సమానత్వం లో భాగంగా మహిళలకు, వెనుకబడ్డ వర్గాలకు అసెంబ్లీ, పార్లమెంటులో రిజర్వేషన్లు వర్తించినప్పుడే అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు దిగువ తరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమములో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి కారుపాకల సరోజ తో పాటు న్యాయవాది ఆకుల నరేందర్ ముత్తోజు రమేష్ కే మహేష్ నాగరాజులు పాల్గొన్నారు