ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : కేంద్ర ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ప్రారంభించిన ప్రధానమంత్రి దర్తీ ఆబ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన సంచార మెడికల్ యూనిట్ ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్ లతో కలిసి ప్రధానమంత్రి జన్ మన్ కార్యక్రమంలో భాగంగా సంచార మెడికల్ యూనిట్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 1 వేయి సంచార మెడికల్ యూనిట్లను ప్రారంభించడం జరిగిందని, ఈ క్రమంలో జిల్లాకు కేటాయించిన మెడికల్ యూనిట్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ యూనిట్ వాహనంలో 1 వైద్యాధికారి,సిబ్బంది ఉంటారని,జిల్లాలోని 21 గిరిజన గ్రామాలలో ఈ వాహనం సంచరిస్తూ గిరిజనులకు అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కార్డులు అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై గిరిజనులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, వారి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత, వైద్యాధికారి అనిల్, పర్యవేక్షకులు విశ్వేశ్వర్ రెడ్డి,డి.పి. ఓ.ప్రశాంతి,జిల్లా మాస్ మీడియా అధికారి బొక్క వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.