జిల్లాలో గ్రూప్-III పరీక్షల సందర్భంగా పటిష్టమైన బందోబస్త్ జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఐపిఎస్.పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

నిర్మల్ జిల్లా లో ఈ నెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది.అందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది.
గ్రూప్-III సర్వీసెస్ పరీక్షల కోసం జిల్లాలో నిర్మల్ పట్టణం లో 24 పరీక్షా కేంద్రాలు నామినేట్ చేయబడ్డాయి. మొత్తం జిల్లాలో 8124 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుంది.కావున పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడ గుమికుడి ఉండవద్దు. జిరాక్స్ సెంటర్,ఇతర దుకాణాలు మూసి ఉంచాలి.ప్రశ్నపత్రాల లీకేజీలు,మాల్ ప్రాక్టీస్ వంటి వాటికి ఆస్కారం లేకుండా,పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది అని ఎస్పీ తెలిపినారు.
మొత్తం జిల్లాలో 200 మంది పోలీస్ అధికారులతో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింద.ఇట్టి బందోబస్త్ లో పాల్గొంటారు అని ఎస్పీ తెలిపినారు.
గ్రూప్-III సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన నియమ,నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని, పరీక్ష కేంద్రాలకు చేరుకొనే సమయంలో అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లు అయితే ఆయా పరిధిలోని పోలీస్ అధికారులకు గాని, డైల్ 100 కు గాని సంప్రదించాలని ఎస్పీ తెలియజేయడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking