ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్, నవంబర్ 15 :
మందమర్రి మార్కెట్ ఏరియాలోని వి3 చలివేంద్రంలో పి.హెచ్.డి గోల్డ్ మెడలిస్ట్ సకినాల విక్రమ్ 28వ, పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. ముందుగా కుటుంబసభ్యుల మధ్య కేక్ కట్ చేసిన అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. విక్రమ్ చిన్నతనం నుండే చదువులో రాణిస్తూ పీ.హెచ్.డి గోల్డ్ మెడల్ సాధించిన సకినాల విక్రమ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు అభినందించి దీవించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.