బొగ్గు బ్లాక్ ల వేలం పాటను రద్దు చేయాలి

-సింగరేణికే బొగ్గు బ్లాక్ లను కేటాయించాలి.

-సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు

ప్రజా బలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 15 :

బొగ్గు బ్లాక్ ల వేలంపాటను రద్దుచేసి సింగరేణికి బొగ్గు బ్లాక్ లను కేటాయించాలని వక్తలు పిలుపునిచ్చారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో మందమర్రి సి ఈ ఆర్ ఓ క్లబ్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ
కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి బ్రతుకుతెరువు చూపిస్తున్న సింగరేణి పైన ప్రైవేటీకరణ కత్తి పెట్టిందన్నారు. సింగరేణి ని నిర్వీర్యం చేయాలని కుట్రలకు పూనుకుందని విమర్శించారు. లక్షలాదిమంది కుటుంబాల్లో వెలుగులు నింపిన సింగరేణిని, మరోవైపు పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వారిని రోడ్డుపాలు చేయాలని బిజెపి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే సింగరేణి కేటాయించాల్సినటువంటి శ్రావణ పెళ్లి బ్లాక్ ను వేలం పాటలో పెట్టి ఆదాని అంబానీ లా చేతుల్లో పెట్టాలని చూస్తుందనీ దుయ్యబట్టారు. సింగరేణి సంస్థకే బ్లాక్ ను కేటాయించాలని సిపిఎం చేస్తున్న పోరాటానికి వక్తలు మద్దతు తెలుపుతూ రాబోయే కాలంలో కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. సింగరేణి సంస్థను ఆధానీ అంబానీల కంపెనీగా మారకుండా జరిగే పోరాటాలకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. నవంబర్ 18 నుంచి సంతకాల సేకరణ చేసి రాష్ట్ర గవర్నర్ కు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, కామిల్ల జయరావ్ ఐఆర్సిపి రాష్ట్ర నాయకులు, పార్వతి రాజిరెడ్డి సింగరేణి ఉద్యోగ సంఘాల నాయకులు. కనికరపు అశోక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, దుంపల రంజిత్ కుమార్, సి.ఐ.టి.యూ జిల్లా కార్యదర్శి, డూర్కె మోహన్, కే.వి.పి.ఎస్ జిల్లా కార్యదర్శి, ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాగం శ్రీకాంత్, ఈదునూరి అభినవ్, ముల్కల్ల కనకయ్య సోషలిస్టు పార్టీ (ఇండియా) జిల్లా అధ్యక్షులు, మల్కల్ల కనకయ్య, లెదర్ ఫ్యాక్టరీ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కొలుగూరి విజయ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్, సింగరేణి సంరక్షణ సమితి నాయకులు, చట్లపెల్లి అనిల్, మంతెన రాజశేఖర్, అంబేద్కర్ సంఘం నాయకులు, పాత వీరస్వామి, మొయ్య రాంబాబు, మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు ఎం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking