సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు.
అంబర్పేట్ ప్రజాబలం ప్రతినిధి: అంబర్పేట్ నియోజకవర్గం లోని బాగ్ అంబర్పేట్ డివిజన్ లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన శంబులఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూఈ సర్వే ద్వారా అర్హులైన ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందుతాయని ,ఈ సర్వే పైన ఎలాంటి అపోహలను నమ్మొద్దని ప్రజలకి తెలియజేశారు. వివక్షను రూపుమాపడానికి ఈ కుల గణనా సర్వే అని, దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం ముందుగా కుల గణన ప్రారంభించి అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడిరదని అందుకు ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.
అంబర్పేట్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వి హనుమంతు రావు ఇంటి నుండి ఈ సర్వే ప్రారంభించినందుకు వి హనుమంతరావు మరియు ఇంచార్జ్ రోహిన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సెక్రటరీ శంబుల శ్రీకాంత్ గౌడ్, సర్వే నిర్వహిస్తున్న వరలక్ష్మి, కుంకుమ సన్నీ, కుంకుమ మనీష్, శివ ,సాయి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.