సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.
ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..
నేతన్న విగ్రహం నుండి లైబ్రరీ మీదుగా లహరి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ..
లహరి ఫంక్షన్ హాల్ లో నాగుల సత్యనారాయణ గౌడ్ చేత జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చెపించిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా,,రియాజ్
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా,,రియాజ్ , కరీంనగర్ పార్లమెంటు ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు , సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాబలం ప్రతినిధి సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నాగుల సత్యనారాయణ గౌడ్ హృదయ పూర్వక అభినందనలు..
10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో యువరాజు లా పరిపాలించిన సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బతికి ఉండడానికి కష్టపడ్డ మీ అందరికీ అభినందనలు..జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గా నాగుల సత్యనారాయణ ఎంతో కష్టపడ్డారు..
ముఖ్యమంత్రి మీకు ఇచ్చిన లైబ్రరీ చైర్మన్ భవిష్యత్ లో రాష్ట్ర స్థాయి బాధ్యతలు వస్తాయి..
ఎన్ని కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన పార్టీ నీ పట్టుకొని శ్రమపడ్డారు…
కరీంనగర్ లోక్ సభ పరిధిలో నలుగురం శాసన సభ్యులం ఉన్నాం..
ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎక్కడ లోటు రాకుండా అభివృద్ధి కి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం..
దక్షిణ కాశి గా పిలువబడే వేములవాడ క్షేత్రానికి ముఖ్యమంత్రి గారు 20 వ తేది వస్తున్నారు..
అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు..
పార్లమెంటు ఎన్నికల్లో మన అభ్యర్థి కొంత ఆలస్యంగా అయినా ఎన్నికల్లో కష్టపడ్డాం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కష్టపడాలి.
48 గంటల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం,10 లక్షల ఆరోగ్య శ్రీ,200 కి యూనిట్ల విద్యుత్ ,500 గ్యాస్ అందిస్తున్నాం..
5 లక్షల రూపాయల తో ఇందిరమ్మ ఇల్లు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది..
లక్ష రూపాయల రుణమాఫీ 5 సంవత్సరాలు చేశారు..
ఒకేసారి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేశాం..2 లక్షల పైన ఉన్నవారికి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తం..
ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నం..
గతంలో నిరసనలకు తావు లేదు సేక్షన్ 30 అమలు ఉండే..
మేము నిరసనలు ఎక్కడైనా చెప్పుకోవచ్చు. పరిధి దాటితే చర్యలు తప్పవు..
కేంద్ర మంత్రి గా కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..
కలెక్టర్ ఐఏఎస్ ల మీద దాడి జరిగితే అరెస్టు కాకుండా ఏం చేయాలో కిషన్ రెడ్డి చెప్పాలి..
ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయచ్చు..ఎక్కడైనా నిరసన తెలపవచ్చు.. కానీ దాడి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు..
స్వేచ్చగా నిరసనలు తెలపాలని మా పోలిసులు సూచనలు చేస్తే దాడులు చేస్తారా..
గతంలో మల్లన్న సాగర్ బాధితులను ఎన్ని ఇబ్బందులు పెట్టరు.. మర్చిపోయారా..
30 సంవత్సరాలు %చీూఖI% కార్యకర్త గా ఉన్న నేను మంత్రి అయ్యా..
పార్లమెంటు పరిధిలో మీ సమస్యలు తెలుసుకోవడానికి మీకు అందుబాటులో ఉంటా..
తోటి కాంగ్రెస్ కార్యకర్త గా సహకార కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నిరంతరం అందుబాటులో ఉంటా..
ఇక్కడి శాసన సభ్యుడు , పార్లమెంటు సభ్యుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలి..
కష్టపడి పనిచేసి బాధ్యతగా ముందుకు కదలాలి..
కష్టపడి పనిచేసిన వారికి పదవులు వస్తాయి
నాగుల సత్యనారాయణ లైబ్రరీ చైర్మన్ అయ్యారు.. డా,, రియాజ్ చాల తెలివిమంతులు ఫ్రిఫెసర్ ఉద్యమకారుడు..
నిరుద్యోగులందరికీ అవసరమైన పుస్తకాలు తెప్పించండి ..
వారికి కౌన్సిలింగ్ ఇవ్వండి .
ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్ లో సిరిసిల్ల జిల్లా ఉద్యోగాల్లో ప్రథమ స్థానంలో ఉండాలి..
చాచా నెహ్రూ జయంతి సందర్భంగా లైబ్రరీ వారోత్సవాలు నడుస్తున్నాయి.
పుస్తకాలు చదివే అలవాటు విద్యార్థి దశ నుండే అలవాటు చేయాలి.
లైబ్రరీ చైర్మన్ అంటే నిరుద్యోగులకు అవసరమయ్యే పుస్తకాలు పోటీ పరీక్షలు అందించి వారికి ఉద్యోగాలు కల్పించాలి..
కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ పని ఉన్న స్థానిక నేతలు ఉన్నారు..వారికి అండగా ఉంటారు .
కార్యకర్తలకు అండగా ఉండాలి..
కాంగ్రెస్ కార్యకర్తలకు మేము ఉన్నామని భరోసా ఇవ్వండి..
పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం మనోధైర్య యాత్ర చేశాం..
ఇప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు వినాల్సిన పరిస్థితి వస్తుంది.
జిల్లా మంత్రులుగా నేను ,శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం మేము అండగా ఉంటాం..
ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు..ఆర్థికంగా మీకు దారీ చూపెడతాం..
చేనేత కార్మికులకు అండగా ఉండే బాధ్యత మాది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ది.