జెండా ఎగురవేసిన డిసిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు తిప్పని లింగయ్య
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 14 : 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం జెండా వెంకటాపూర్,లక్షెట్టిపేట సంఘ కార్యాలయ ఆవరణలో డిసిఎంఎస్ చెర్మన్ తిప్పని లింగయ్య ఏడురంగుల సహకార జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. గురువారం ఈ సందర్భంగా డిసిఎంఎస్ చెర్మన్ తిప్పని లింగయ్య మాట్లాడుతూ… సహకార పతాక విశిష్ట ఫ్రెంచి సహకార వెత్త చార్లెస్ పొరిరియన్ సహకార ఉద్యమ ప్రగతి ఏడు రంగుల జెండాను సూచించారు.1923వ సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా “అంతర్జాతీయ సహకార సమితి”ఈ పతాకమును అంగీకరించారు,ఈ పతాకం
లోని ప్రతి రంగునకు ఒక ప్రత్యేక అర్ధం ఇవ్వబడింది. ఈ ఏడు రంగులను
(VIBGYOR) అనుపదం ద్వారా పలుక వచ్చును,ఈ ఏడు రంగులు ఇంద్రధనస్సు
రంగులు,ఇది”భిన్నత్వంలో ఏకత్వం”నునిరూపించు చున్నవి”సమాజంలో బడుగు,బలహీన వర్గాలకు సహాయపడడం మన దేశ ప్రధాన ఆశయాల్లో ముఖ్యమైనది.ఈ ఆశయ సాధనకు సహకార విధానమే శరణ్యం “జవహర్ లాల్ నెహ్రూ ఆనాడే అన్నారు. అంతేకాకుండా”భారతదేశానికి అత్యున్నత నమ్మకమైనది సహకార విధానం.ఇది కూలిపోతే గ్రామీణ ప్రజల ఆశలు ఫలవంతం కావు”
జవహర్ లాల్ నెహ్రూ సూచించారు.”కలిసి ఉంటే నిలబడుతాం విడిపోతే పడిపోతాం”రవీంద్రనాథ్ ఠాగూర్ అని అన్నారు.
“సహకారం బలహీనుల రక్షణ కవచమే తప్ప బలవంతుల ఆయుధం కాదు”గాంధీజీ అన్నారు. అంతే కాకుండా మరో మాట”సహకారోద్యమం నైతిక ఉద్యమంగా కొనసాగినంత కాలం అది భారతదేశానికి వర ప్రసాదమే అవుతుంది”
గాంధీజీ అన్నారు. “సహకారం వరం లాంటిది.దాని ద్వారా మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకుపోగలం”మహాత్మా గాందీ అన్నారు.”సహకార వ్యవస్థ ప్రభుత్వ విభాగాల ప్రమేయానికిగాని,వత్తిడికిగాని లోనుగాకుండా స్వేచ్ఛగా పనిచేయాలి. ”నెహ్రూ అన్నారు. “విపరీతమైన ప్రభుత్వ జోక్యంతో సహకార సంస్థలపై నియంత్రణ అధికమైతే సహకారోద్యమాభివృద్ధి కుంటుపడుతుందనడంలో సందేహం లేదు”నెహ్రూ అన్నారు.ఇంక “ప్రతి గ్రామానికి ఒక పంచాయితీ,ఒక సహకార సంఘం,ఒక పాఠశాల తప్పనిసరిగా ఉండాలి” గాంధీ ఆనాడు చూస్తారు.”19 వ శతాబ్దంలో ప్రపంచానికి లభించిన ఆర్ధిక అద్భుతాలలో సహకారం ఒకటి”డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ అని అన్నారు.”సహకారం అనేది ప్రజలచేత,ప్రజల బాగు కొరకు నడిపించబడే ఉద్యమం”ఇందిరా గాంధీ అన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్-చైర్మన్ కాసు సురేష్,డైరెక్టర్ లు వేల్తపు శ్రీకర్,అప్పని లింగన్న , దాందేని లక్ష్మయ్య, కాండ్రపు సతయ్య,బెంబడి పౌలు,సెక్రటరీ విష్ణువర్ధన్ రావు, సంఘం సిబ్బంది మరియు కో ఆపరేటివ్ డిపాజిట్ మెంట్ తదితరులు పాల్గొన్నారు.